సీఎం జగన్మోహన్ రెడ్డి  తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పలు ఉద్యమాలు ర్యాలీలో పాల్గొన్న  పలువురు మీద నమోదైన కేసులు ఎత్తివేస్తూ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ లో  ఆసక్తికరంగా  మారింది ఆంధ్రప్రదేశ్  సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన మాజీ ముఖ్యమంత్రి  దివంగత నేత అయిన రాజశేఖర్ రెడ్డి అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి మనందరికీ తెలిసినదే.

 

అప్పుడు కొందరు అల్లర్లు సృష్టించారు  అప్పుడు జరిగిన ఆందోళనల్లో కొందరు రిలయన్స్ కంపెనీ కి సంబందించిన పెట్రోల్ బంకులు  మిగిలిన  షాపులు మొదలైన వాటిపై  పై దాడులకు పాల్పడ్డారు.కంపెనీ కి సంబంధించి ఆస్థి  నష్టం జరగడం తో దాడులకు పాల్పడిన  వారి అందరి పై కేసులు నమోదు వచ్చేసారు అప్పటి పోలీసులు.అప్పుడు కేసులు నమోదు అయినా వారందరిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. 

 


అంతేకాదు  కాపు ఉద్యమంలో భాగంగా తుని పట్టణంలో జరిగిన విధ్వంసానికి సంబంధించి అనేక మందిపై కేసులు నమోదు చేశారు ఆ కేసు ఉన్న నిందితుల పై పెట్టిన కేసులను కూడా  రద్దు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ తాజాగా వెల్లడించింది అంతేకాక భోగాపురం ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ చేస్తున్న సందర్భంలో కొందరు రైతులు భూమికి సంబందించిన వాళ్ళు అడ్డుకున్నారు ఆలా   అడ్డుకున్న వారిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు

 

ఆ  ఉదంతానికి సంబంధించిన కేసులను కూడా ఎత్తి వేస్తున్నట్లు తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చెప్పారు ఈ కేసులో అన్నిటికీ సంబంధించిన కేసులు ఎత్తి వేస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు  హోంశాఖ ముఖ్య కార్యదర్శి కె ఆర్ యం కిషోర్ కుమార్ వెల్లడించారు వివిధ ఉద్యమాలు 
 పలు గొడవలకు సంబంధించిన  కేసు ఎత్తి వేసిన దానిపై ప్రతిపక్ష నేతలు ఎలా ప్రతిస్పందిస్తారు మరి వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: