పిల్లలను సంరక్షించడంలో తల్లి ముందుంటుంది. అది మూగ‌జీవాలైనా ప్రాణం ఉన్న మ‌నుషులైన అమ్మ ప్రేమ‌లో ఉండే ఆ క‌మ్మ‌ద‌నం వేర‌నే చెప్పాలి. పిల్ల‌లు ఎన్ని త‌ప్పులు చేసినా త‌న క‌డుపులో పెట్టుకుని దాచేదే త‌ల్లి. అలాగే పిల్ల‌లు ఏ అంగ‌వైక‌ల్యంతో పుట్టినా కూడా ద‌గ్గ‌ర‌కు తీసుకుని హ‌త్తుకుని వాళ్ళ‌కు ఆ లోటు తెలియ‌కుండా చూసుకునేది కూడా త‌ల్లే. ఈ ప్రపంచంలో ఎవ్వ‌రికైనా ఎటువంటి లోపాలున్నా ఎవ్వ‌రైనా స‌రే ఎత్తి చూపించినా ఒక్క త‌ల్లి మాత్ర‌మే వాటిని దాచి వాటికి ఎలా ఎదురెళ్ళాల‌నేది నేర్పిస్తుంది. ఇలా త‌ల్లి ప్రేమ క‌న్నా మ‌రేది గొప్ప‌ది కాదు అని చెప్పుకుంటాము మ‌న‌ము అలాంట‌ప్పుడు ఒక త‌ల్లి త‌న బిడ్డ విష‌యంలో క‌ర్క‌సంగా ప్ర‌వ‌ర్తించిందంటే ఎంత వ‌ర‌కు న‌మ్మోచ్చు...

 

ఇది నిజం... ఇటీవ‌లె  కన్నతల్లే బిడ్డను చంపేస్తే... చంపి తినాల్సిన కుక్కలు ప్రాణం ఉన్న పసిపాప‌ను చూసి రక్షించాయి. డ్రైనేజీలో ఉన్న ప్లాస్టిక్ మూటలో ఏదో ఉందని తినబోయిన కుక్కలు అందులో ప్రాణంతో ఉన్న పాపను చూసి అరిచాయి. దీంతో ఏడుస్తున్న పాపను చూసిన చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే హర్యాణలో అమ్మతనం అనేప‌దం మంటగలిసిపోయింది. రాష్ట్రంలోని కైతల్ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసిబిడ్డ‌ను అమానుషంగా ఒక‌ ప్లాస్టిక్ కవర్‌లో చుట్టచుట్టి డ్రైనేజీలో విసిరేసింది ఓ గుర్తు తెలియని తల్లి... అయితే అదృష్టవశాత్తు పాప బతికే ఉంది. డ్రైనేజీలో పసిపాపతో ఉన్న మూటను కుక్కలు రోడ్డు మీదకు ఈడ్చుకు వచ్చాయి. అయితే కుక్కలు మూటను విప్పుతున్న ప్రయత్నంలోనే అందులో ఉన్న పాప ఏడుస్తుండడం స్థానిక ప్రజలు గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.  

 

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పాపను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే పాప కేవలం 1100 గ్రాముల బరువు మాత్రమే ఉందని, దీంతో పరిస్థితి విషమంగా ఉందని, సీరియస్ కండీషన్‌లోనే చికిత్స కొనసాగిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కాగా పసిపాపను డ్రైనేజీలో వేసిన గుర్తు తెలియని మహిళ వివరాలు సీసీ కెమారాలో తీసుకున్న పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. దీన్ని బ‌ట్టి క‌నీసం మూగ జీవాల‌కు ఉన్న విశ్వాసం కూడా ఎందుకో మ‌నుషుల్లో ఉండ‌డం లేదు. రోజు రోజుకూ మ‌నిషిలోని మాన‌వ‌త్వం చ‌చ్చిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: