ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో టిడిపి మనుగడ సంకటంగా మారింది. ఒక పక్క పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏపీలో గుర్తించదగ్గ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో బాబు తన మైండ్ గేమ్ ను మార్చాల్సి వచ్చింది. ముఖ్యంగా బాబు.. జనసేన మరియు బీజేపీ అండతోనే 2014 ఎన్నికల్లో విజయం సాధించగలిగాడు అన్నది అందరి మాట. తర్వాత బిజెపితో తనంతట తానే వైరం పెట్టుకొని దూరం వచ్చేయగా పవన్ తనకంటూ ఒక గుర్తింపు కోసం టిడిపిని వీడాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇద్దరికీ దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుండగా వారిద్దరూ అతనితో పొత్తుకి ససేమిరా అనడంతో బాబు కొత్త వ్యూహంతో బరిలోకి దిగాడు.

 

చెప్పాలంటే చంద్రబాబుకు జనసేన చాలా అవసరం. ఎందుకంటే కేవలం కమ్మ సామాజిక వర్గం ఓట్లు మరియు బి.సి వారి ఓట్లతో అతను తన పార్టీని లాగడం చాలా కష్టం కాబట్టి పవన్ గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడితే వారిద్దరూ కలిసి ఉన్నారు అన్నట్లు కటింగ్ ఇచ్చి కాపు సామాజిక వర్గం ఓట్లను కూడా పొందవచ్చు అన్నది బాబు ప్లాన్. అందుకే మధ్యనే లోకేష్ కూడా ఒక బహిరంగ సభలో పవన్ లాంటి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉండడం రాష్ట్రం యొక్క అదృష్టం అని చెప్పాడు. ఒక పార్టీలోని బడా నేత అయినా చోటా నేత అయినా పార్టీ అధిష్టానం చెప్పినట్లే వ్యవహరించాలి కాబట్టి బాబు జనసేనతో వైరం పెట్టుకునే పరిస్థితి అయితే లేదు.

 

అటు బిజెపి ని మాత్రం బాబు వైకాపాను ఎలా ద్వేషిస్తాడో అలాగే వారిని కూడా ద్వేషించే పనిలో పడ్డాడు. అమరావతిని రాజధానిగా నిర్మించాలన్న నిర్ణయం అతనిదే అని.. మోదీ కేవలం వచ్చి శంకుస్థాపన చేశాడని అసలు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా బిజెపి వారు ఎవరూ కనీసం అమరావతిలో అడుగు కూడా పెట్టలేదని బాబు వాదన. కాబట్టి మోదిని ఆంధ్ర ప్రజలకు విలన్ గా చూపిస్తూ పవన్ ను పొగడడం బాబుకి ఎంత మేలు చేకూరుస్తుందో పవన్ కు అంతే చేటు చేస్తుంది.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: