ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు వ్యవహారం విపక్ష తెలుగుదేశం పార్టీకి చికాకుగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయంగా బలహీనపడి ఎలా బలం పెంచుకోవాలో అర్ధం కాక తెలుగుదేశం ఇబ్బంది పడుతున్న తరుణంలో జగన్ కొట్టిన రాజధాని దెబ్బకు బాబు 40 ఏళ్ళ పరిశ్రమ షేక్ అయిపోయింది అనే చెప్పుకోవచ్చు. అమరావతి ఉద్యమం ఏ స్థాయిలో చేసినా జగన్ లో మార్పు రాకపోవడంతో చంద్రబాబు ఇప్పుడు కేంద్రం ద్వారా ప్రయత్నాలు చెయ్యాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అక్కడ కూడా కేంద్రం సైలెంట్ అవ్వడంతో బాబు ఒత్తిడిలో ఉన్నారట. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబుకి సరికొత్త సమస్య వచ్చి పడింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన చాలా మంది నేతలు పార్టీకి ఆర్ధికంగా అండగా ఉన్నారు. వారి అందరికి రాజధాని అమరావతిలో న్యాయం జరిగింది. ఇప్పుడు చంద్రబాబుకి ఆర్ధికంగా అండగా నిలబడింది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు గుడ్ బై చెప్పడానికి సిద్దంగా ఉన్నారట. వారిలో ఒక కీలక నేత కూడా ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు సలహాతోనే వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను అమ్ముకుని మరీ అమరావతిలో భూములు కొన్నారు. 

 

కాని ఇప్పుడు రాజధాని మార్చడంతో వాళ్ళ భూముల విలువ దాదాపుగా పడిపోయింది. దేశంలో ఉన్న ఆస్తులను కూడా అమ్ముకుని వాళ్ళు ఇక్కడ భూములు కొనడంతో ఇప్పుడు భారీగా నష్టపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. చంద్రబాబు మీద ఇప్పటికే ఒక రాజ్యసభ ఎంపీ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్టు కూడా సమాచార౦. ఇటీవల ఆయన్ను కలిసిన సదరు ఎంపీ గారు... ఎందుకు భూములు కొనమన్నారు అంటూ ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం. తాను ఆర్ధికంగా నిలబడిన తరుణంలో ఈ దెబ్బ పడింది అంటూ తన బాధ అంతా బయటకు చెప్పుకున్నారట. ఇదే బాటలో చాలా మంది నేతలు ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: