తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎంపీ రేవంత్ రెడ్డికి కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. జన్వాడ వద్ద మంత్రి కేటీఆర్ ఫామ్ పామ్ హౌస్ ను డ్రోన్ ను తో చిత్రీకరించిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. అయితే అది పెద్ద కేసేమో కాదని అంతా అనుకున్నారు. సింపుల్ గా బెయిల్ దొరుకుతుందని భావించారు... ఇదే తరహా కేసులో గతంలో చాలా మందికి బెయిళ్లు వచ్చాయని చెబుతున్నారు.

 

 

అంతే కాదు.. ఇదే కేసులో ఆరుగురికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రేవంత్ రెడ్డికి మాత్రం కుకట్ పల్లి కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దీంతో రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. మరోవైపు ఈ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రేవంత్ రెడ్డికి అంతగా సపోర్టు దొరకడం లేదు. ఇదే అదనుగా పార్టీలో రేవంత్ రెడ్డిని తొక్కేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

 

 

కేటీయార్ ఫామ్ హౌజుపై రేవంత్‌రెడ్డి పోరాటాన్ని వ్యక్తిగతంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. దీనికి పార్టీతో సంబంధం లేదని.. రేవంత్ పై వచ్చే ఆరోపణలకు సమాధానం చెప్పాలని.. రేవంత్ వ్యవహారంపై పార్టీలో సీరియస్ చర్చ జరగాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరో కీలకమైన విషయం ఏంటంటే.. రేవంత్ పోరాడుతున్న జీవో 111 పరిధిలో కాంగ్రెసోళ్ల ఫామ్ హౌజులే ఎక్కువగా ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ నాయకులే. దీనిపై మరీ ఎక్కువ చేస్తే పార్టీకే నష్టమని సలహా ఇస్తున్నారు.

 

 

పార్టీలో వీహెచ్, జగ్గారెడ్డి వంటి నేతలు కూడా ఇప్పుడు రేవంత్ తీరునే తప్పుబడుతున్నారు. కీలక మైన సమయంలో రేవంత్ కు పార్టీ నుంచి సపోర్టు మాత్రం లభించడం లేదు. మరోవైపు బెయిల్ దొరకలేదు.. పాపం రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయారా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: