ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌కలం కొన‌సాగుతోంది. ఈ మ‌హ‌మ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30ల‌క్ష‌ల మందికి పైగా దీని బారిన ప‌డ‌గా..మ‌ర‌ణాలు రెండు ల‌క్ష‌ల‌కు పైగా న‌మోద‌య్యాయి. ఈ క‌రోనా మ‌హ‌మ్మారితో దేశాలే అత‌లాకుత‌లం అవుతున్నాయి. అయితే, దీనికంటే ప్రపంచానికి దీనికంటే మ‌రో పెద్ద ముప్పు పొంచి ఉంది. అదే ఆక‌లి చావులు. ఔను. మ‌నతో క‌లిసి జీవిస్తున్న వారిలో చాలామందిని ఆక‌లి ప్రాణం తీయ‌నుంది.

 

వరల్డ్‌ పుడ్‌ ప్రోగ్రామ్ ప్ర‌తినిధులు తాజాగా సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. కరోనా మహామ్మారి విజృంభణ ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలో ఆకలి చావులు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని  హెచ్చరించారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ను పాటిస్తున్న క్ర‌మంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నార‌ని పేర్కొన్నారు. అలాంటి వారిని ఆదుకోకపోతే ఆక‌లి కేక‌లు త‌ప్ప‌వ‌ని సూచించారు. ఇప్పటికే పేద దేశాల్లో ఆక‌లితో అల‌మ‌టిస్తున్నార‌ని... ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలు ఐక్య‌రాజ్య‌స‌మితికి ఇచ్చే నిధుల్లో కోత విధించడం స‌రికాద‌న్నారు. అటు వరల్డ్‌ పుడ్‌ ప్రోగ్రామ్ ద్వారా 10 కోట్ల మందికి ఆహరాన్ని అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులో 3 కోట్ల మంది కేవలం తామిచ్చే ఆహారంపై ఆధారపడ్డారని.. వీరికి సమయానికి ఆహరాన్ని అందించకుంటే చాలా నష్టం జరుగుతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

 


ఇదిలాఉండ‌గా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రజలందరిపైన కోవిడ్‌ 19 ప్రభావం చూపుతోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్‌లోనైనా దీని బారిన పడక తప్పదన్న భయాందోళనలు ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి. ఇవి తగ్గాలంటే వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులోకి రావాల్సిందే. ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య వేగంతో విస్తరిస్తోంది. గతేడాది డిసెంబర్‌ చివరివారంలో దీన్ని మొట్టమొదటిగా కను గొన్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దీన్ని అరికట్టగల టీకా తయారీకి పలు అంతర్జాతీయ ఔషద సంస్థలు ప్రయత్నాలు మొదలెట్టాయి. జీవరసాయన శాస్త్రవేత్తలు, వైద్య బృందాలు, బయో థెరపిస్ట్‌లు ఈ ప్రయత్నాలు సాగిస్తు న్నారు. ఇప్పటికే 73బృందాలు వ్యాక్సిన్‌ రూపొందించాయి. ఇందులో ఆరు బృందాలు క్లినికల్‌ ట్రయల్స్‌ వరకు వెళ్ళాయి. మిగిలిన బృందాలన్నీ వారం పదిరోజుల్లోనే క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించనున్నాయి. అయితే కనీసం 18మాసాలకు గాని కోవిడ్‌ 19 నిరోధక వ్యాక్సిన్‌ను విస్తృత స్థాయిలో తయారు చేసేందుకు వీలేర్పడదని ఈ బృందాలన్నీ భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: