దేశంలో మొదట విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల కరోనా  కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నారైలు భారత్ కి రావడం వల్ల వారి నుంచి ఇతరులకు..వారి నుండి ఇంకొంత మందికి  ఈ వైరస్ వ్యాప్తి జరిగింది. కానీ దేశంలో ఈ మహమ్మారి వైరస్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది దేని  వల్ల అంటే ఢిల్లీలో జరిగిన తబ్లిక్  సమావేశం కారణంగానే అన్న విషయం అందరికి తెలిసిందే. కరోనా  వైరస్ వ్యాప్తి మొదట్లో ఈ సమావేశం జరగడం ఈ సమావేశానికి వేల సంఖ్యలో ఉన్న తబ్లీజీయులు  హాజరవడం వారి ద్వారా దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి జరగటం  రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది. దీంతో దేశంలో సాధారణ స్థాయిలో ఉన్న మహమ్మారి కరోనా  వైరస్ వ్యాప్తి.. ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 

 


 అయితే ఈ మధ్య కాలంలో భారత్లో మత ప్రచారాలకు వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా అవుతున్న  విషయం తెలిసిందే. ఇతర దేశాల నుంచి మత ప్రచారాలు చేసుకునేందుకు భారతదేశానికి వస్తున్నారు చాలామంది. మత ప్రచారం కోసం విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల కూడా ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవంగా అయితే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లి మత ప్రచారం చేయాలి అంటే ప్రత్యేక వీసా  పొందవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం భారత్ కి మత ప్రచారానికి వస్తున్న వాళ్లు సాధారణమైన విసిటింగ్ వీసా ద్వారానే వస్తూ మత ప్రచారం నిర్వహిస్తున్నారు. 

 

 కాగా ప్రస్తుతం ఇలాంటి వారి  అరెస్టులు కూడా కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలాంటి అరెస్టులు జరగడం లేదు. అయితే ఇలా విదేశాల నుంచి వచ్చి మత ప్రచారం చేస్తున్న వారు  అన్ని  తెలిసి కూడా మహమ్మారి వైరస్ వ్యాప్తికి తోడ్పాటు అవుతున్నారు అని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇక మైనార్టీ ఓటింగ్ దెబ్బ తింటుంది అనే కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలా అక్రమంగా వచ్చి మత ప్రచారం నిర్వహిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని అంటున్నారు. అయితే ఈ కరోనా  వైరస్ వ్యాప్తి విషయంలో కూడా ఓటు బ్యాంకు రాజకీయమే  నడిచింది  అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: