ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రతిపక్షాల కంటే ప్రభుత్వ వ్యవస్థలోనే ఎక్కువగా ఎదురు దెబ్బలు తగులుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్ మీడియం, అమరావతి విషయంలో ఇంకా చాలా విషయాలలో ఇటీవల ఏపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల వల్ల గట్టిగా షాకుల మీద షాకులు తగలటం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ హైకోర్టు ప్రశంసించింది. పూర్తి మ్యాటర్ లోకి వెళ్తే  తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరియు వలస కార్మికులు ఇంకా వేరే అంశాలపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం విచారణ చేశారు.

 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల్లో లక్ష మందికి 2 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కేవలం 500 పరీక్షలు మాత్రమే నిర్వహించడం పట్ల సీరియస్ అయింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు పెంచాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

 

కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ఇచ్చిన ఎందుకు తెలంగాణ సర్కారు లో చలనం లేదని గట్టిగా హైకోర్టు ప్రశ్నించింది. కాగా మొదటి నుండి తెలంగాణ రాష్ట్రంలో విపక్షాల నుండి కూడా టెస్టులు విషయంలో కేసిఆర్ సీరియస్ గా తీసుకోవడం లేదన్న వాదన వినబడుతోంది. అంతేకాకుండా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా దాచి పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో హైకోర్టు తెలంగాణకి అక్షింతలు వేసి ఏపీని పొగడటం తో ఈ విషయం సంచలనం అయ్యింది. ఏపీలో  రాష్ట్ర పనితీరుని అక్కడ ఉన్న వ్యవ్యస్థలు తప్పుపడుతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని పొగడటంతో చాలామంది మేధావులు హైకోర్టు ఏపీ ప్రభుత్వ  పని తీరు అర్ధం చేసుకుందని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: