కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి.. భారత్ లో కూడా ఇటీవల కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రోజూ కనీసం ఆరు, ఏడు వేల కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కాస్త నయం. అయితే కరోనా గురించిన ఓ గుడ్ న్యూస్ చెబుతున్నారు వైద్య నిపుణులు. అదేమిటంటే.. కరోనా వచ్చిన వారిలో కేవలం 5 శాతం మందికి మాత్రమే వైద్యం అవసరం అవుతుందట.

 

 

మిగిలిన 95 శాతం మంది అసలు వైద్యం అవసరం లేకుండానే కరోనా నుంచి బయటపడతారట. కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ గా నిర్ధారణ అయిన బాధితులకు ఇంట్లోనే ఉండొచ్చు. హోం క్వారంటైన్ లో ఉండొచ్చు. అంతే కాదు.. వసతి లేకపోతే ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందువల్ల భయపడాల్సిన అవసరం కూడా లేదంటున్నారు.

 

 

కేసుల సంఖ్య ఎంత పెరిగినా మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని వైద్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల అనంతరం ప్రజలు బయట సంచరిస్తున్న క్రమంలో కేసులు పెరగడం సహజం అంటున్నారు వైద్య నిపుణులు. అయితే అలాగని కరోనాను తేలిగ్గా తీసుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

 

ఇప్పుడు కేసులు ఎక్కువగా వస్తున్నాయని కంగారు పడాల్సిన అవసరం లేదట. ఎందుకంటే.. ఇక ముందు కూడా తెలుగు రాష్ట్రాల్లో కేసులు భారీగానే నమోదవుతాయట. అయితే కరోనా సోకినవారిలో ఐదు శాతం మందికే చికిత్స అవసరం అవుతున్నందువల్ల భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సో.. అందుకే కరోనా గురించి ఎక్కువగా ఆలోచించకండి.. ఎక్కువగా భయపడకండి.. కాకపోతే.. అవగాహన కలిగి ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: