ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ విడుదల చేసినా సరే ఎక్కడా కూడా ఉద్యోగ సంఘాలు వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఉద్యోగ సంఘాల అధ్యక్షులు చంద్రశేఖర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేయకుంటే బాయ్ కాట్ చేయడానికి సిద్దంగా ఉన్నాం అని ఆయన స్పష్టం చేసారు. అవసరమైతే సమ్మెకు కూడా వెళ్తాం అన్నారు. ఎలక్షన్ కమీషనర్ వేనా ప్రాణాలు...మావి కావా అని ఆయన ప్రశ్నించారు. కరోనా వాక్సిన్ ప్రక్రియ పూర్తయిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి అని డిమాండ్ చేసారు.

ఎలక్షన్ కమీషనర్ తన పంతాన్ని నెగ్గించుకునేందుకే ఈ ఎన్నికలు పెడుతున్నారు అని అన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు అని ఆయన స్పష్టం చేసారు. సోమవారం సుప్రీంకోర్టు లో వచ్చే ఆదేశాల అనుగుణంగా మా కార్యాచరణ రూపొందిస్తాం అని అన్నారు. ఏపి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... ఎస్ఈసి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పై స్పందించిన ఆయన... సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు తాము ఎదురుచూస్తాం అన్నారు. అంతవరకు సహకరించేది లేదు అని స్పష్టం చేసారు.

ఉద్యోగులందరికీ వాక్సిన్ వేసిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. ఎస్ఈసి మా విజ్ఞప్తి ని పట్టించుకోలేదు అని మండిపడ్డారు. ఎస్ఈసికి ప్రభుత్వం సహకరించాలని హై కోర్టు చెప్పింది అని అన్నారు. అయితే పరిస్థితులు క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉన్నాయి అని ఆయన అన్నారు. గతంలో ఎస్ఈసి ఆదేశం అమలు చేయనందుకు కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. అయితే జీవించే హక్కు ఉద్యోగులకు కూడా ఉందని గుర్తించాలి అని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు వాక్సిన్ రాలేదు..ఇప్పుడు వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది అనీ అన్నారు. అది పొందే హక్కు ఉద్యోగులకు ఉంది అని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: