ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్య శిక్షణ విషయంలో సిఎం జగన్ నుంచి ప్రతీ ఒక్కరు కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా వరకు సీరియస్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్ధులు ప్రతీ ఒక్కరికి కూడా నైపుణ్యం ఉండాలి అని ఏపీ సర్కార్ భావిస్తుంది. డిసెంబర్ లో  నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన  చేస్తామని పరిశ్రమలు, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేసారు.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై ముగిసిన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్కిల్ కాలేజీలు, యూనివర్శీటీల ఏర్పాటు పనులలో  చర్చ జరిగింది. 20 స్కిల్ కాలేజీలకు భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తి అయిందని అధికారులు తెలిపారు. మరో 5 కాలేజీలకు కేటాయింపులో  ప్రస్తుత  పరిస్థితిపైనా మంత్రి ఆరా తీసారు. తొలుత పరిపాలన విభాగం నుంచి అనుమతులకు ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ, విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, కడప జిల్లాలో ముందు స్కిల్ కాలేజీల ప్రారంభానికి చర్చించారు.

నైపుణ్య విశ్వ విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన నిధుల సమీకరణ పైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న మంత్రి మేకపాటి ఛాంబర్ లో ఈ సమీక్ష జరిగింది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.అనంత రాము, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో, ఎండీ అర్జా శ్రీకాంత్ ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, తదితరులు హాజరు అయ్యారు. నవంబర్ 15 కల్లా సమగ్ర పరిశ్రమ సర్వే పూర్తి చేయాలని మంత్రి మేకపాటి ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటి వరకూ 13 జిల్లాలలో జరుగుతున్న  సమగ్ర పరిశ్రమల సర్వే జరుగుతున్న తీరుపై మంత్రి ఆరా తీసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: