భారత్ చైనా సరిహద్దు ల్లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రోజు రోజుకు యుద్ధ మేఘాలు కమ్ము కుంటున్నాయి . ఇటీవల చైనా అధ్యక్షుడు యుద్ధానికి సిద్ధంకండి అంటూ చైనా సైన్యానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. భారత్ కూడా సంసిద్ధమైపోతుంది. అయితే చైనా భారత యుద్ధం చేయడం ఏమో కానీ.. చైనా సరిహద్దుల్లో సృష్టిస్తున్న ఉద్రిక్తతల కారణంగా భారత ఆర్మీ రోజు రోజుకు మరింత పటిష్టవంతంగా మారిపోతుంది. ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసే విధంగా ప్రస్తుతం భారత ఆర్మీ అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేస్తూ శరవేగంగా ప్రయోగాలు నిర్వహిస్తూ వాటిని భారత అమ్ములపొదిలో చేరుస్తుంది.



 ఈ క్రమంలోనే చైనాతో తలెత్తిన విడుదల నేపథ్యంలో ఇప్పటికే అధునాతన టెక్నాలజీతో కూడిన పలు విదేశీ ఆయుధాలను కూడా భారత అమ్ములపొదిలో చేర్చిన భారత ప్రభుత్వం.. ఇక భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో తయారుచేసి వినూత్నమైన ఆయుధాలు కూడా శరవేగంగా ప్రయోగాలు నిర్వహిస్తూ భారత ఆర్మీలో చేరుస్తున్న విషయం తెలిసిందే . రోజురోజుకు డిఆర్డివో తెరమీదకు తెస్తున్న ఆయుధాల సామర్ధ్యాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే మరో ఆయుధాన్ని  కూడా సిద్ధం చేసింది భారత్.




 ఇప్పటికే వరుసగా ప్రయోగాలు జరుగుతూ విజయవంతం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే భారత్  స్వతంత్రంగా తయారు చేసినటువంటి అస్త్ర  మార్క్ బివిఆర్ఏఎమ్ మిస్సైల్ 150 కిలోమీటర్ల దూరం లో ఉన్నటువంటి లక్ష్యాలను ఎంతో సమర్థవంతంగా ఛేదించగలిగింది. యుద్ధ విమానాలను బిగించేందుకు వీటిని కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అటు రక్షణ శాఖ నుంచి హోంశాఖ నుంచి కూడా అనుమతులు రావడంతో ఇక ఈ మిస్సైల్  భారత అమ్ములపొదిలోకి  చేరుకొంది. ప్రస్తుతం రోజు రోజుకు మరింత శరవేగంగా మారిపోతున్న పరిణామాల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: