కరోనా కారణంగా అనేక రంగాలు మూలనపడ్డాయి.. మహా మహా ధనవంతులు కూడా దివాలా తీశారు. కానీ.. కొందరు చైనా వాళ్లు మాత్రం కరోనా టైమ్‌లోనూ తెగ సంపాదించేశారు. ఇంకో మాటలో చెప్పాలంటే.. వాళ్లు కరోనా ముందు కన్నా కరోనా టైమ్‌లోనే బాగా సంపాదించారు. కరోనా సమయంలో వచ్చిన డిజిటల్ విప్లవమే అందుకు కారణంగా తెలుస్తోంది. కరోనా వైరస్‌ సంక్షోభం నేపథ్యంలోనూ చైనా ఇంటర్నెట్‌ పారిశ్రామికవేత్తల సంపద పెరిగిందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

మరి అలా కరోనా టైమ్‌లోనూ తెగ సంపాదించిన వారు ఎవరో తెలుసుకుందామా.. ఈ జాబితాలో  ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం జాక్ మాది ఫస్ట్ ప్లేస్.. కరోనా టైమ్‌లో అంతా ఆన్ లైన్ హవాయే నడిచింది కదా. అదే ఇందుకు కారణం. హురున్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌  చేసిన అధ్యయనం ప్రకారం.. జాక్‌ మా సంపద 2019తో పోలిస్తే 45 శాతం పెరిగిందట. ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ  58.8 బిలియన్‌ డాలర్లు అంటే.. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు రూ.4.4 లక్షల కోట్లు అన్నమాట.


ఇక ఆ తర్వాత ప్లేస్ వీచాట్‌ మెసేజింగ్‌ సర్వీస్‌ అందించే టెన్సెంట్‌ సంస్థ వ్యవస్థాపకుడు మా హుటెంగ్‌ ది.. ఈయన సంపద ఎంతో తెలుసా..  57.4 బిలియన్‌ డాలర్లు. జాక్ మా తర్వాత స్థానం ఈయనదే.  విచిత్రం ఏంటంటే జాక్ మా కంటే కాస్త ఎక్కువగానే ఈయన ఆస్తి వృద్ధి రేటు ఉంది. మా హుటెంగ్‌ ఆస్తి 50 శాతం వృద్ధి చెందింది.


మూడో స్థానం బాటిల్డ్‌ వాటర్‌ బ్రాండ్‌ నాంగ్‌ఫూ స్ప్రింగ్‌ ఛైర్మన్‌ జాంగ్‌ షాన్‌సన్‌ ది... ఈయన ఆస్తి విలువ 53.7 బిలియన్‌ డాలర్లు. మరి ఈయన ఆస్తి ఎందుకు  పెరిగిందంటారా.. అందుకూ కారణం ఉంది. సెప్టెంబరులో జాంగ్‌ కంపెనీ హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌లో నమోదు అయ్యింది. దీంతో ఈయన ఆస్తుల విలువ అమాంతం పెరిగింది. ఇక ఈ లిస్టులో ధనిక మహిళగా రియల్ ఎస్టేట్ సంస్థ కంట్రీ గార్డెన్‌ అధిపతి యాంగ్‌ హ్యుయాన్‌ స్థానం దక్కించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: