పార్టీ బలాన్ని పెంచడానికి, ప్రజలలో నమ్మకాన్ని పెంచడానికి చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. పార్లమెంట‌రీ ప‌ద‌వులు , పార్లమెంట‌రీ మ‌హిళా క‌మిటీలని, రాష్ట్ర క‌మిటీ, పొలిట్ బ్యూరో, జాతీయ ప‌ద‌వులు అంటూ కొత్త కొత్త పదవులు సృష్టించి అందులో టీడీపీ నేతలను నియమించి అధికార ప్రభుత్వం కంటే ఎక్కువ హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.. అంతేకాకుండా తమ పార్టీ పై కమ్మ ముద్ర చాలా ఉందని అందరికి తెలిసిందే.. దాన్ని చెరిపేసి విధంగా అయన ప్రయత్నాలు మొదలుపెట్టారు.. వాస్తవానికి చంద్రబాబు ను ఓడించిన ముఖ్య కారణం ఇదే.. టీడీపీ బీసీ లను పట్టించుకోవట్లేదని చాలావరకు బీసీ ల ఓట్లు వైసీపీ కి పడ్డాయి..

దాంతో అతి దారుణంగా టీడీపీ పార్టీ ఓటమి కి గురైంది.. అయితే ఈ ఓటమికి కారణాలు వెతికే క్రమంలో టీడీపీ కి పెద్ద కారణం కమ్మ బలం ఎక్కువైపోయి, బీసీ ల బలం తక్కువైపోవడమే అని తెలిసింది.. దాంతో కమ్మ ముద్ర పోవడానికి చంద్రబాబు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.. రాష్ట్రం విడిపోయిన తర్వాత కమ్మ పార్టీగా తెలుగుదేశానికి బలంగా ముద్రపడింది. ఎందుకంటే ఈ పార్టీ లోని కీలకమైన పదవుల్లో కమ్మ నేతలే ఉన్నారు.. వారు ఏం చెపితే కింది స్థాయి నేతలు అది వినాల్సి వచ్చింది.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రచారం ఊపందుకుంది. అమరావతి రాజధాని భూముల కొనుగోలు దగ్గర నుంచి అన్ని కాంటాక్టుల్లోనూ ఆ సామాజిక వర్గానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ బలంగా తీసుకెళ్లగలిగింది. దీంతోనే తమకు దీర్ఘకాలంగా ఉన్న ఇతర సామాజిక వర్గాలు దూరమయ్యాయని చంద్రబాబు విశ్విసిస్తున్నారు.  

ఇక ఇప్పటికీ చంద్రబాబు అదే విధానాన్ని అవలంభిస్తున్నారని వైసీపీ గగ్గోలు పెడుతుంది..అయితే ఇటీవలే టీడీపీ ప్రవేశపెట్టిన పలు పదవుల్లో చంద్రబాబు  కమ్మ సామాజికవర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తన వెంట నమ్మకంగా, సన్నిహితులుగా ఉన్న వారిని సయితం చంద్రబాబు పక్కన పెట్టారు. పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుల నియామకంలోనూ కమ్మ సామాజిక వర్గానిక అరకొర ప్రాధాన్యత మాత్రమే దక్కింది. ఎక్కువగా బీసీ సామాజికవర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.దీంతో కమ్మ ని బలం తగ్గించుకోవడం ఆయనకు ఎంతవరకు లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: