గత కొంతకాలంగా సినీ నటులు రాజకీయాల్లో పెద్దగా రాణించే పరిస్థితి కనబడటం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కొంతమంది రాజకీయాల్లోకి రావాలని భావించిన సరే వారికి అనుగుణంగా పరిస్థితి కనబడటం లేదు. కొంత మంది నటులు కూడా రాజకీయాల్లోకి రావడానికి మార్గం సుగమం చేసుకున్నారు. మరి కొంత మందికి సహాయ సహకారాలు అందడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. త్వరలోనే తెలుగు రాజకీయాల్లో ఒక నటుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే అందుకు అనుగుణంగా పరిస్థితులు లేకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారని సమాచారం. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక నటుడు రాజకీయ రంగప్రవేశం చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఆయన మొన్నటివరకు సినిమాల్లో విలన్ పాత్ర పోషించారని ఇప్పుడు ఆయనకు టిఆర్ఎస్ పార్టీలో మంచి గౌరవం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆయన ఎవరు ఏంటి అనేది తెలియకపోయినా... ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అని అంటున్నారు. మరి ఆయన ఎవరు ఏంటి అనేది త్వరలోనే స్పష్టత రానుంది.

ఇక టీఆర్ఎస్ పార్టీలోకి మాజీ హీరోయిన్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వీరికి ఎన్నికల్లో ఇచ్చే సీటు విషయంలో కూడా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. దీనితో వారు పార్టీ లోకి రావడానికి మార్గం సుగమం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎప్పుడొస్తారు ఏంటి అనేది త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే నటుడు ఎవరు అనే దానిపై సినీ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.  మరి ఆయన ఎప్పుడు పార్టీ లోకి వస్తారు ఏంటి అనేది చూడాలి. అయితే ఆయనను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వాడుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: