దుబ్బాక ఉప ఎన్నికలు ఇపుడు తెలుగు రాష్ట్రాలను ఒక్క లెక్కన వేడెక్కిస్తున్నాయి. దుబ్బాక టీయారెస్ సిట్టింగ్స్ సీటు. ఇక్కడ నుంచి పోటీ చేసి 2018 ఎన్నికల్లో గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి మొత్తం నాలుగు సారులు ఎమ్మెల్యేగా వరసగా కొనసాగారు.ఆయన రాజకీయం చాలా బలమైనది. పైగా ఆయన హరీష్ రావు కి అత్యంత సన్నిహితుడు. ఇక దుబ్బాకలో టీయారెస్ కి పెట్టని కోటగా చెబుతారు. ఇక  తెలంగాణాలో మరో మూడేళ్ళకు పైగా టీయారెస్ అధికారంలో ఉంటుంది. దాంతో ఉప ఎన్నికల్లో ఓటర్లు మామూలుగా అయితే అధికార పార్టీనే గెలిపిస్తారు. పైగా సానుభూతి కూడా తోడు అవుతుంది. మరి ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా కూడా టీయారెస్ ఎందుకు వణుకుతోంది.

ఇక అనూహ్యంగా ఇక్కడ బీజేపీ దూసుకువచ్చేసింది. బీజేపీ చేస్తున్న రాజకీయానికి సరైన జవాబు టీయారెస్ ఇస్తోంది. దాంతో అక్కడే రాజకీయ లాభాన్ని కాషాయం పార్టీ పొందుతోంది. తెలంగాణా మొత్తం మీద కాదు, తెలుగు రాష్ట్రాలలోనే దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందా అన్నదంతా సీన్ ఇపుడు క్రియేట్ అయింది. తాజాగా కేటీయార్ మాట్లాడుతూ దుబ్బాకలో భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. కచ్చితంగా ఇక్కడి ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక హరీష్ రావు అయితే దుబ్బాకలో రాజకీయ లొల్లి చేద్దామని కాంగ్రెస్, బీజేపీ రెండూ చూస్తున్నాయి. కానీ వారికి ప్రజలు  గట్టి గుణపాఠం చెబుతారు అంటూ బిగ్ సౌండ్ చేశారు. సరే ఇంతలా ఈ ఇద్దరు టీయారెస్ మేటి నాయకులు చెబుతూంటే నమ్మాల్సిందే కానీ కూల్ గా గెలుచుకోవాల్సిన చోట ఇంత ఆయాసం టీయారెస్ ఎందుకు పడుతుందో అర్ధం కావడం లేదు అంటున్నారు. ఇక బీజేపీ అభ్యర్ధి గా పోటీలో ఉన్న రఘునందన్ రావు చాలా గట్టి క్యాండిడేట్. దానికి తోడు, బీజేపీ పెద్ద నాయకులు అంతా మోహరించి ఉన్నారు.

మరో వైపు కాంగ్రెస్ తో లోపాయి కారీ ఒప్పందం కనుక బీజేపీ పెట్టుకుంటే మాత్రం ఇక్కడ టీయారెస్ కి కష్టమేనని అంటున్నారు. తెలంగాణాలో కేసీయార్ కి ఒకసారి అయినా పరాభవం చవి చూపిద్దామని కాంగ్రెస్, బీజేపీ రెండూ అనుకుంటున్నాయి. కాబట్టి ఈ రెండూ కూడా చివరి నిముషంలో కూడబలుక్కుంటే మాత్రం టీయారెస్ కి చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు. మరి అది కనుక జరిగితే టీయారెస్ ఫలితం తేడా కొడుతుంది, కానీ కధ అంత దూరం వరకూ వెళ్తుందా అంటే ఏమో ఇది రాజకీయం ఎవరు చెప్పగలరు...

మరింత సమాచారం తెలుసుకోండి: