తెలంగాణ కాంగ్రెస్ నుంచి కొంతమంది కీలక నేతలు బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరు వెళ్తారు ఏంటి అనే దానిపై ఎలాంటి స్పష్టత లేకపోయినా దాదాపుగా పది నుంచి పదిహేను మంది నేతలు ఇప్పుడు బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పటికే పార్టీ మారడానికి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన చేవెళ్ల ఎంపీ సీట్ అడుగుతున్నారు.

బిజెపి నేతలు కూడా ఇప్పుడు ఆయన విషయంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ బలపడాలి కాబట్టి పార్టీలోకి వచ్చిన నేతల డిమాండ్లను కాదు అదే పరిస్థితిలో లేదు అని అంటున్నారు. ఇక విజయశాంతి కూడా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు భారతీయ జనతా పార్టీ ఒక ఆఫర్ కూడా ఇచ్చింది అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె ఒక ఎంపీ సీటును మాత్రం ఖచ్చితంగా అడుగుతున్నారని సమాచారం.

మెదక్ నుంచి తనకు ఎంపీ సీటు కావాలని ఆమె పట్టుబడుతున్నారు. దీంతో త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే విజయశాంతికి రాష్ట్ర పార్టీ నేతలు చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానంతో కూడా ఒకసారి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కీలక అడుగు పడే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధారంగా చూస్తే... విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఎంతమాత్రం కూడా యాక్టివ్గా కనపడటం లేదు. దీని వలన ఆ పార్టీ నేతలు కూడా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. మరి విజయశాంతి పార్టీలో ఉంటారా లేదా బయటకు వస్తారా అనేది చూడాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: