గ్రేటర్ ఎన్నికల నగారా మోగిన  నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ హాట్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. వరుసగా దుబ్బాక ఉప ఎన్నికలు జరగడం ఆ తర్వాత ఫలితాలు వెలువడటం అటు  వెంటనే జిహెచ్ఎంసి ఎన్నికల కు సంబంధించిన విడుదల కావడంతో ఎన్నికల వేడి ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికల నాటి నుంచి అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు కొనసాగుతుంది అనే విషయం తెలుస్తుంది. బీజేపీపై టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ అటు బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉంటే... అధికార పార్టీ పై బిజెపి కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ అటు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.



 ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ అధికార టీఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ ఇస్తూ విజయఢంకా మోగించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ చేయడానికి బిజెపి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అటు టిఆర్ఎస్ కూడా ఈసారి మేయర్ పీఠం టీఆర్ఎస్ పార్టీదే  అని పూర్తిగా ధీమాతో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరికి వారు తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.



 కాగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానం ద్వారా ఎంతోమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఇదే విషయంపై మాట్లాడిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బిజెపి అంటే టిఆర్ఎస్ కు భయం పట్టుకుందని అందుకే బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ మండిపడ్డారు . తెలంగాణలో ఎల్ఆర్ఎస్ పోయి ప్రజల కష్టాలు తీరాలి అంటే టిఆర్ఎస్ పోవాలి అంటూ వ్యాఖ్యానించారు. భాగ్యనగరాన్ని పాకిస్తాన్ గా మార్చాలని టిఆర్ఎస్ భావిస్తుందని బీజేపీ గెలిస్తే పాత బస్తీని భాగ్యనగరం గా మారుస్తాము అంటూ హామీ ఇచ్చారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే బిజెపికి ఓటు వేయాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: