అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్‌ (కల్వకుంట్ల చంద్రశేఖర రావు) విడుదల చేశారు. మహానగరం... మన పాలన... మన పార్టీ పేరుతో మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మన హైదరాబాద్‌ నగరానికి విశ్వఖ్యాతి తీసుకొచ్చేలా తమ టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తోందని అన్నారు. కేసీఆర్‌ మాట్లాడుతూ మన హైదరాబాద్ మహా నగరానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అందరికీ ఉచిత త్రాగు నీరు అందిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల డిసెంబర్‌ నుంచి ప్రజలు ఎవరూ వాటర్‌ బిల్లులు చెల్లించనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో లోని ముఖ్యాంశాలు..‌

టీఆర్ఎస్ మేనిఫెస్టో :

మేనిఫెస్టో :- మహానగరం.. మనపాలన.. మన పార్టీ

1) 90 కిలోమీటర్ల వరకు ఎంఎంటీఎస్ రైళ్లు

2) డిసెంబర్ నుంచి నీటి బిల్లు మాఫీ

3) 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా

4) ఓఆర్ఆర్ అవతల రీజనల్ రింగ్ రోడ్డు

5) అర్హులందరికీ రేషన్ కార్డులు, ఫించన్లు

6) అండర్ గ్రౌండ్‌లో హైటెన్షన్ విద్యుత్ వైర్లు

7) సినిమా థియేటర్లకు షోలు పెంచుకునే అవకాశం

8) కరోనా కాలంలో సినిమా థియేటర్ల విద్యుత్ బిల్లు మాఫీ

9) టికెట్ ధర సవరించుకునే అవకాశం

10) సెలూన్లు, దోబిఘాట్లకు ఉచిత విద్యుత్
వచ్చేనెల నుంచి సెలూన్లకు ఉచిత విద్యుత్ అమలు

11) బస్తీల్లోని ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం

12) 10కోట్ల ఖర్చుతో తీసే సినిమాలకు జీఎస్టీ మినహాయింపు

13) జీరో కార్బన్ సిటీగా హైదరాబాద్

14) కరోనా కాలానికి మోటార్ వాహన పన్ను రద్దు

15) రాయిదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రో ట్రైన్

16) బీఎస్ఎన్ఎల్ నుంచి మెహిదీపట్నం వరకు మెట్రో మార్గం

17) నగరంలో రెండోదశలో 125 లింకు రోడ్లు

18) సినీ కార్మికులకు ఉచితంగా రేషన్, హెల్త్ కార్డులు

మరి ఇన్ని వరాలతో అధికార టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏమేరకు గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలపై ప్రభావం చూపుతుంది అనే విషయం మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: