హైదరాబాద్ లో ఎన్నికల సమరం తలపిస్తుంది. అన్ని పార్టీ లు గెలుపు తమదంటే తమదంటూ చెప్పుకుంటూ ప్రచారం చేస్తుంది.. పోలింగ్ తేదీ కి ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో ప్రచార అంకం చివరి దశకి వచ్చేసింది అని చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రం తో ప్రచార ఘట్టం ముగిసిపోతుంది.. ఈ లోగా ఎవరు ఎంత ప్రచారం చేసుకుంటారో చూడాలి.. ప్రచారంలో బీజేపీ అన్ని పార్టీ లకన్నా ముందు ఉందని చెప్పాలి.. ఎందుకంటే అసలే బలం లేని పార్టీ గా ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ను మించి ఫామ్ లో ఉంది..

ఇక గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఉపయోగించాల్సన అన్ని అస్త్రాలను ఉపయోగించింది.. రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి అవసరం ఉన్నా లేకున్నా కొంతమంది కీలక నేతలను రప్పించి ప్రచారం చేయించింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ కి మోడీ రాక అందరిలో ఒక సెన్సేషన్ ని సృష్టించింది.. అయితే అయన ఓ విజిట్ ప్రకారం ఇక్కడికి రాగా  ప్రచారంలో పాల్గొనటాని కూడా అన్నారు.. అయితే అయన వచ్చిన పని ముగుంచుకుని ఇటు చూడకుండానే వెళ్ళిపోయారు.

మిగితా విషయలేమో కానీ మోడీ హైదరాబాద్ కి రావడం బీజేపీ కి శుభ సూచకంగా చెప్పాలి. పరోక్షంగా బీజేపీని ప్రమోట్ చేయడం కోసమే మోదీ హైదరాబాద్ ని సందర్శించారని అధికార పార్టీ విమర్శస్తుండగా, ఎన్నికలకు, ప్రధాని పర్యటనకూ ఎలాంటి సబంధం లేదని బీజేపీ వాదిస్తోంది. ప్రధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి సహా స్థానిక ప్రజా ప్రతినిధులెవ్వరికీ పాల్గొనే అవకాశం లభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో తనకు ఆహ్వానం లేదంటూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తి చేశారు. ఇది ప్రధాని వ్యక్తిగత పర్యటనో, బీజేపీ సొంత కార్యక్రమమో కానప్పుడు స్థానిక ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు? మోదీ అధికార పర్యటనలో ముఖ్యమంత్రికి పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ శ్రేణులు సైతం తీవ్రంగా స్పందించాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన అవమానంగా వర్ణించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: