గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో చివరి రోజు కావడంతో బిజెపి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక కీలక నేతలు అందరూ కూడా నేడు ప్రచారంలో చాలా దూకుడుగా ఉన్నారు. తాజాగా బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. బోరబండ డివిజన్ లో బీజీపీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా ఎంపీ అరవింద్ ప్రచారం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చేసే పాపాలన్నీ చేసి టీఆర్ఎస్ వాళ్లు వినాయకుడికి కండువా కప్పారు అని మండిపడ్డారు.

ఒక్క హామీ అయిన  నెరవేర్చారా? అని ఆయన ప్రశ్నించారు. మోడీ దేశవ్యాప్తంగా రెండున్నర  కోట్ల ఇళ్లు ఇచ్చారు అన్నారు. లక్షల్లో ముస్లింలకు కూడా ఇళ్లు ఇచ్చారు అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్  ఎందుకు అమలు చేయడం లేదు అన్నారు. ముస్లిం లకు 12 శాతం రిజెర్వేషన్ కేసీఆర్ ఎందుకివ్వలేదు? అని నిలదీశారు. అగ్రవర్ణ పేదలకు మోడీ 10 శాతం రిజెర్వేషన్ ఇచ్చారు అన్నారు.  ముస్లింలూ ఆ రిజెర్వేషన్ ను ఉపయోగించుకోవచ్చు అని ఆయన చెప్పారు.

ముస్లింలు కేసీఆర్ కు ఏందుకు ఓటెస్తుర్రు అని ఆయన నిలదీశారు. యోగి కట్టిన 35 లక్షల ఇళ్లల్లో దాదాపు 7 లక్షల ఇళ్లు ముస్లిములవి ఉన్నాయి అన్నారు. సమాజాన్ని మత ప్రాతిపదికన విడదీసి టీ ఆర్ఎస్ ఓట్లు కొల్లగొడుతోంది అని ఆయన మండిపడ్డారు. నిన్న సభలో పాత స్పీచ్ నే కేసీఆర్ మళ్లీ చదివాడు..సుత్తి పెట్టాడు అని అన్నారు. కేసీఆర్ కేటీఆర్ మీద ప్రజలకు విశ్వాసం పోయింది అని ఆయన వ్యాఖ్యానించారు. నమోగంగే  స్కీం కింద యోగి గంగా నది ప్రక్షాళన చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కనీసం హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేశారా? అని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రానికి శనిలా దాపరించింది అన్నారు. ఎలక్షన్ అయిపోయాక రూపాయి కూడా వరద సహాయం ఇవ్వరు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. సన్న బియ్యం పేరుతో రైతులను మోసం చేసిండు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: