గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఐటి ఉద్యోగుల ఓటు వేయకపోవడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు నమోదైన ఓటు శాతం చూస్తే 17 శాతం గా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు 12 శాతం ఓటు గా నమోదయింది. అయితే ఇప్పుడు ఐటీ ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను వేగంగా నిర్వహించాలని భావిస్తోంది. కొన్ని ప్రాంతాలకు వేగంగా వెళ్లి ప్రచారం చేయాలని అందర్నీ కూడా పార్టీల నాయకులు చైతన్యం చేసి సాయంత్రం లోపు పోలింగ్ బూత్ లోకి తీసుకురావాలని సూచనలు చేస్తున్నారు.

వికలాంగులు చాలామంది ఎన్నికలు ఓటింగ్ లో పాల్గొన్న సరే ఐటీ ఉద్యోగులు మాత్రం ఓటింగ్ లో పాల్గొనక పోవడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మాదాపూర్ శేర్లింగంపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు ఉన్నారు. అయినా సరే వారు ఎవరూ కూడా పోలింగ్ లో పాల్గొనడానికి ముందుకు రాకపోవడంతో అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ కి దూరంగానే ఉన్నారు. దీనివలన పోలింగ్ శాతం భారీగా తగ్గుతోంది.

11గంటల వరకు కూడా పోలింగ్ శాతం 11% గానే ఉంది. దీని వలన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. బస్తీ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయకపోతే మాత్రం కీలక పార్టీల విజయావకాశాలను దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది అని పలువురు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు విపక్షాలు బస్తీ ప్రాంతాల్లో ఓటుబ్యాంకు పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంతవరకు ఓటువేస్తారు ఏంటి అనేది చూడాలి. ఇక టిఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ కూడా ఇప్పుడు వెళ్లి ఓట్లు వేసే వారిని పోలింగ్ బూత్ తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: