పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.  ఓవైపు ఆర్థికంగా మరోవైపు భద్రత  పరంగా ఇలా అన్ని విధాలుగా సంక్షోభంలో కూరుకుపోతోంది పాకిస్తాన్. పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకు పాకిస్తాన్ పతనానికి కారణం అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఏకంగా పాకిస్తాన్ లో ఉండే ప్రజలు సైతం పాకిస్తాన్ ప్రభుత్వ తీరును ద్వేషిస్తూ ఉద్యమాల బాట  పడుతూ ఉండటం పాకిస్తాన్ ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పటికే రోజురోజుకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది పాకిస్తాన్. ప్రస్తుతం పాకిస్తాన్ మారక నిల్వలు తగ్గిపోతుండటంతో  పాకిస్తాన్ విదేశీ మారక నిల్వల విలువ  అప్పులకు వడ్డీ చెల్లించేందుకు కూడా సరిపోని పరిస్థితి నెలకొంది




 అంతేకాదు పాకిస్తాన్ కు ఆర్థిక సాయం చేస్తూ అండగా ఉండే అన్ని దేశాలతో కూడా పాకిస్తాన్ నోటి దురుసు తో వివాదాల నేపథ్యంలో ప్రస్తుతం సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా పాకిస్తాన్ ని దూరం పెట్టడంతో పాకిస్తాన్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది అయినప్పటికీ నోటి దురుసు తగ్గించుకోని పాకిస్తాన్ ఫ్రాన్స్ తో  వివాదానికి వివాదానికి తెర లేపడం తో మరిన్ని షాక్లు తగిలాయి అనే విషయం తెలిసిందే. ఫ్యాన్స్ తో ఉన్న వివాదం కారణంగా ఫ్యాన్స్ కు సంబంధించిన యుద్ధ విమానాలకు ఇప్పటినుంచి రిపేర్  చేయబోము  అంటూ తేల్చి చెప్పింది.



 అమెరికా కూడా తమ దగ్గర తీసుకున్నటువంటి ఎఫ్ 16 కు సంబంధించిన యుద్ధ విమానాలకు డబ్బులు చెల్లించకుండా రిపేర్ చేయలేకపోయాము  అంటూ తేల్చి చెప్పింది. ఇటీవలే మరో షాక్ తగిలింది పాకిస్తాన్ కి.  దీంతో మరో సంక్షోభం ఏర్పడినట్లు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. చైనా కు సంబంధించినటువంటి జే 17  విమానాలకు సంబంధించిన ఇంజన్లు దొరకడం లేదు. ఒకవేళ పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసినట్టు వంటి జే 17 యుద్ధ విమానాల ఇంజన్లు కావాలంటే వాటికి డబ్బులు చెల్లించి మరి పాకిస్తాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక స్థోమత పాకిస్తాన్ దగ్గర లేదు. దీంతో పాకిస్తాన్ పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: