గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి దారుణంగా ఉంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారంగా చూస్తే ఆ పార్టీ ఏమాత్రం కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రభావం చూపించలేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ని చాలా వరకు అభివృద్ధి చేసిన సరే ఆ పార్టీ మాత్రం ఆశించిన స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రమే గట్టి పోటీ ఇచ్చారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని సర్వే లు చెపుతున్నాయి. అయితే ఇప్పుడు ఎంపీ రేవంత్ రెడ్డి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి అటు ఇటుగా స్థానాలు వస్తే రేవంత్ రెడ్డి మద్దతు కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రేవంత్ రెడ్డితో ఇప్పటికే బిజెపి జాతీయ స్థాయి నేతలు అందరూ కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బీజేపీ లోకి రావాలని కచ్చితంగా అధికార టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడదామని ఆయనకు హామీలిస్తున్నారు.

అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో మళ్లీ మీరు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే విధంగా తాము సీటు ఇస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తుంది. మరి రేవంత్ రెడ్డి పార్టీ మారతారా లేదా అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం రేవంత్ రెడ్డి సత్తా చాటడం కాంగ్రెస్ లో ఇతర నేతలు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల తర్వాత ఆయన విషయంలో జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: