ఇది కల్తీ యుగం.. కల్తీ లేకుండా స్వచ్చమైన ఆహార పదార్ధాలు దొరకడం చాలా కష్టంగా మారింది. అసలే కల్తీ అంటే.. దానికి తోడు ఇప్పుడు సాగులో ఉపయోగించే పురుగు మందుల అవశేషాలు ఆహార పదార్దాల్లోకీ వస్తున్నాయి. ప్రత్యేకించి కూరగాయల విషయంలో ఇది ఎక్కువగా ఉంది. మరి రైతులు అధిగ దిగుబడి రావాలన్నా.. పంటలను తెగుళ్ల నుంచి కాపాడుకోవాలన్నా పురుగు మందుల వాడకం తప్పనిసరి అయ్యింది. అందుకే రైతులు పంటల సాగు సమయంలో విషపూరిత రసాయనాలను విస్తృతంగా చల్లుతున్నారు.

అలా సాగు సమయంలోనే విషపూరిత రసాయనాలు పంటల్లోకి చేరిపోతున్నాయి.. ఇక పట్టణాలు, నగరాల్లో తాజా కూరగాయలు లభించడమే చాలా కష్టం.. పట్టణాల్లో లభించే పండ్లు, కూరగాయలపై రసాయన అవశేషాలుంటున్నట్లు శాస్త్రీయంగా నిర్వహించే పరీక్షల్లో గుర్తించారు. మరి ఇలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పండ్లు, కూరగాయలు కొన్నప్పుడు  నేరుగా కోసుకుని తినొద్దని నిపుణులు చెబుతున్నారు.

మరి ఏం చేయాలి.. కూరగాయలు కొని నేరుగా వాటిని కోసి ఎట్టి పరిస్థితుల్లో వండుకోవద్దంటున్నారు. మరి ఎలా వినియోగించాలి అంటారా.. పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా నల్లా నుంచి ధారగా వచ్చే నీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో బేకింగ్‌ సోడా లేదా ఉప్పు వేసి అందులో కూరగాయలు కొద్దిసేపు ఉంచి మళ్లీ కడగాలి. ఇలా చేయడం వల్ల వాటిపై రసాయన అవశేషాలుంటే చాలా వరకూ తొలగిపోతాయి.

కూరగాయల లోపల ఉండే రసాయనాలను ఎలాగూ మనం నిరోధించడం.. కనీసం పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా నల్లా నుంచి ధారగా వచ్చే నీటిలో శుభ్రంగా కడగడం ద్వారా కొంత వరకూ రసాయనాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.  గోరువెచ్చని నీటిలో బేకింగ్‌ సోడా లేదా ఉప్పు వేసి అందులో కూరగాయలు కొద్దిసేపు ఉంచి మళ్లీ కడగడం ద్వారా ఉపరితలంపై ఉన్న రసాయనాల అవశేషాలను తొలగించుకోవచ్చు. అందుకే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. ఏమంటారు..! 

మరింత సమాచారం తెలుసుకోండి: