కేంద్ర ప్రభుత్వం కొన్ని వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. ముఖ్యంగా టూరిజం కోసం ఉపయోగించే వాహనాలకు మేలు చేసేందుకుగాను కొత్త విధానాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం మనదేశంలో ట్రక్కులకు, ఇతర భారీ వాహనాలకు వన్ టైం జాతీయ పర్మిట్ వార్షిక రుసుం విధానం అమలులో ఉంది. అయితే విధానాన్ని ఇకపై టూరిజం వాహనాలపై కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం. అమలు చేస్తున్న వన్‌టైం జాతీయ పర్మిట్‌ వార్షిక రుసుం విధానం వల్ల పర్యాటక వాహనాలు కట్టే రుసుము లలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఒక వేళ ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యాటక వాహనాలకు ఒకే రకమైన రుసుములు ఉండనున్నాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక వంటి పలు రాష్ట్రాలు పర్యాటక వాహనాల నుంచి అత్యధిక రుసుములు వసూలు చేస్తున్నాయి. దీంతో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఆయా రాష్ట్రాల్లో ఈ ట్యాక్స్‌ 50 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ముసాయిదా కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.  ఇక ఈ కొత్త విధానానికి సంబంధించి విడుదల చేసిన ముసాయిదాకు ఏ రాష్ట్రమూ అభ్యంతరం చెప్పలేదని సమాచారం.

‘ఇకపై పర్యాటక వాహనాలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే రుసుము ఉంటుంది. అది సదరు వాహన సామర్థ్యం బట్టి నిర్ణయిస్తారని’ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా అంతర్‌-నగర ప్రయాణాలకు ప్రేవేటు వాహనాల కంటే వాణిజ్య వాహనాలనే ప్రజలు ఎక్కువగా వాడే అవకాశం ఉందని మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. మరి ఈ విధానం టూరిస్ట్ వాహనాలలో ఎలాంటి వాటికి అమలవుతుంది. అనేదానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: