ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు వింత వ్యాధి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా భీమడోలు మండలం పూళ్ళ అనే గ్రామంలో ఈ కేసులు నమోదు అయ్యాయి. భీమడోలు మండలం పూళ్ళలో వింత వ్యాధి బాధితుల సంఖ్య క్రమంగా పెరిగింది. దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా తీవ్ర స్థాయిలో జరిగింది. వింత వ్యాధి లక్షణాలతో భీమడోలు మండలం  పూళ్ళ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే  వాసు బాబు... వారికి ధైర్యం చెప్పారు.

ఇక తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వారిని పరామర్శించారు. టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర,  గన్ని వీరాంజనేయులు,  బడేటి చంటి పరామర్శించారు. ఇక భీమడోలు మండలం  పూళ్ళ పీహెచ్ సీ వద్ద టిడిపి వైసిపి నాయకుల మధ్య  ఘర్షణ జరిగింది. కోలుకోకుండానే పేషెంట్లను  డిశ్చార్జ్ చేస్తున్నారని అధికారులతో టిడిపి  వాగ్వాదంకు దిగింది. దీంతో పక్కనేవున్న వైసిపి నాయకులు టిడిపి నేతలతో వాగ్వాదంకు దిగారు. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. ఇక ఇదిలా ఉంటే...డి

వారిని పరామర్శించిన మంత్రి ఆళ్ళ నానీ కీలక వ్యాఖ్యలు చేసారు. పూళ్ళ గ్రామంలో ఒక ప్రాంతంలో ఎక్కువగా వింతవ్యాధి కేసులు నమోదు అయ్యాయి అన్నారు. మొన్న 7, నిన్న 7  ఈ రోజు 4 నమోదు అయ్యాయి అని చెప్పారు. ఆసుపత్రికి వచ్చిన వారు అందరూ బాగానే వున్నారు అన్నారు. ఇప్పటికే కొందరు  డిశ్చార్జ్ అయ్యారు అని పేర్కొన్నారు. ఎవరికి ప్రాణాపాయం లేదు అని అన్నారు. పూళ్ల ఆసుపత్రిలో  అదనపు బెడ్లు, మందులు ఏర్పాటు చేసామని చెప్పారు. ఏలూరు నుండి స్పెషల్ టీమ్ నియమించాం అని అన్నారు. కేసులు వస్తున్న ప్రాంతంలో 108 వాహనాలు సిద్ధం చేశాం అని తెలిపారు. ప్రస్తుతం 5 వైద్య బృందాలు ఏర్పాటు చేసాం..  మరో 5 బృందాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక్కడ పరిస్థితి , ఏలూరు ఘటన ఒకటా కాదా అన్నది నిపుణులు తేల్చాలి అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: