తెలంగాణ సర్కార్ ప్రజల సంతోషం కోసం కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి విన్నూతన ఆలోచన చేస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ధిక నష్టాల్లో ఉన్న చిరు వ్యాపారులకు సర్కార్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే.. ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చిన కూడా కాదనకుండా సాయం చేస్తూ వచ్చిన మంత్రి హరీష్ రావు ఆటో డ్రైవర్లు జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. గత ఏడాది ఎదుర్కొన్న పరిస్థితులను అధిగమించడానికి ఈ కొత్త ఆలోచన చేసినట్లు చెబుతున్నారు.



ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్‌ రావు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ది పేటలో ఆటో క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేయడమే కాక, వారికి రుణాలు అందించేందుకు తన ఆస్తిని బ్యాం కుకు తాకట్టు పెట్టారు. దీంతో ఇప్పుడు వారికి రుణాలు సులభంగా అందనున్నాయి. గురువారం సిద్దిపేటలో హరీశ్‌ రావు చేతుల మీదుగా 850 మంది ఆటో వాలాలకు రుణాలు, డ్రెస్సులు అందించనున్నారు.



వందలాది మంది ఉపాధి కోసం ఆటోలు తీసుకొని కాలం వెళ్లదీస్తుండగా కరోనాతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. రోజువారీ ఫైనాన్స్‌లు తీసుకుంటూ ఆటో నడపగా వచ్చిన మొత్తాన్ని మిత్తీలకే చెల్లించుకుంటూ మళ్లీ అప్పుల పాలవుతున్నారు. ఇదంతా గమనించిన హరీశ్‌రావు 2019 అక్టోబరులో సొసైటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇందులో సభ్యుల సంఖ్య 850కి చేరింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆటో ఆర్‌సీ తదితర అంశాలు అర్హతగా ఎంత మంది వచ్చినా సభ్యులుగా చేర్చుకునేందుకు సొసైటీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. మంత్రి హరీష్ రావు చేసిన ఆలోచనకు జనం ఫిదా అవుతున్నారు. ఆయన మొదటి నుంచి ప్రజలకు మేలు చేసే ఆలోచనలో ఉన్నారని ప్రజలు అంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: