గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ చూసినా కూడా ఒకే చర్చ జరుగుతోంది అదే...  త్వరలో తెలంగాణ ముఖ్య మంత్రి పదవిని కేటీఆర్ చేపట్ట బోతున్నారు అన్నదానిపై. అధికార పార్టీ ఎక్కడ సమావేశం నిర్వహించిన ప్రతి టిఆర్ఎస్ పార్టీ నేత కూడా త్వరలో కేటీఆర్ ముఖ్య మంత్రి కాబోతున్నారని...  అందుకు తాము ఎంతో సంతోషి స్తున్నాము అంటూ చెబుతున్నారు. ఇక మరి కొంతమంది కేటీఆర్ ముఖ్య మంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్న నాయకుడు అంటూ మరికొంత మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.



 ఇక కొంతమంది నేతలు అయితే ఏకంగా కేటీఆర్ ని పక్కనే ఉంచుకుని కేటీఆర్ త్వరలో ముఖ్య మంత్రి కాబోతున్నారు.. అంటూ ఎన్నో సమావేశాల్లో కూడా మాట్లాడుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో కేసీఆర్ ముఖ్య మంత్రి కాబోతున్నాడు అన్న అంశం తెలంగాణ రాజకీయా లను ఊపేస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యం లో ప్రస్తుతం అటు ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో దీనిపై స్పందిస్తున్నారు ఇటీవలే నిజాంబాద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ విషయం పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 సీఎం కేసీఆర్ కు ప్రస్తుతం వయసు పైబడిందని... త్వరలో ముఖ్యమంత్రిగా కేటీఆర్ పదవి బాధ్యతలు చేపట్టడం బెటర్ అని ప్రస్తుతం అధికార పార్టీ నేతలు చెబుతున్నారని.. ఇక కేటీఆర్ బెటర్ అన్నారంటే కేసిఆర్ ఫెయిల్ అయినట్లే కదా అంటూ ప్రశ్నించారు జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ చేసిన పాలన ఇక  చాలు అని టిఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారని అందుకే ఔరంగజేబ్ పాలన కావాలి అనుకుంటున్నారు అంటూ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దీనిపై అటు అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: