ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. "ఆత్మ హత్యలు"..ఇవి మనకు కొత్తేమి కాదు. ప్రపంచంలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఆత్మ హత్యలకు పాల్పడి తమ ప్రాణాలని అనవసరంగా పోగొట్టుకుంటున్నారు. ఇలా వారు చేసుకునే ఆత్మ హత్యల వెనుక అనేక రకాల కారణాలు ఉండొచ్చు. అవి ఒక్కోసారి ఎదుటి వాళ్లకి అర్ధం కావు. కొంతమంది ఆర్థిక సమస్యలు కారణంగా ఆత్మ హత్యలు చేసుకుంటుంటారు. కొంతమంది తమ ప్రేమ విఫలమయిందని ఆత్మ హత్యలు చేసుకుంటుంటారు. కొంతమంది పని ఒత్తిడికి తట్టుకోలేక మానసికంగా క్రుంగిపోయి ఆత్మ హత్యలకి పాల్పడుతుంటారు. కొందరు తమ పరువు పోయిందని ఆత్మ హత్యలు చేసుకుంటుంటారు. ఇలా కారణాలు ఏమైనా కాని రోజుకి చాలా మంది రక రకాల కారణాలతో ఆత్మ హత్యలకి పాల్పడుతుంటారు..



ఇక జపాన్ దేశంలో కూడా ఆత్మ హత్యలు ఎక్కువైయ్యాయని సమాచారం అందుతుంది.ఇక అక్కడ ఎక్కువగా యంగ్ స్టర్స్ ఆత్మ హత్యలకి పాల్పడుతున్నారట.. ఆ యంగ్ స్టర్స్ లో కూడా ముఖ్యంగా యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. వారి ఆత్మ హత్యలకి బలమైన కారణం ఒక్కటేనటా... అదే ఒత్తిడి... చాలా మంది యువతులు ఒత్తిడికి లోనయ్యి అక్కడ చనిపోతున్నారట...సాధారణంగా జపాన్ లో పని చేసే యువతులు ఎక్కువ. వారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసి అలసిపోతున్నారట.


కనీసం విశ్రాంతి తీసుకునే సమయం కూడా లేదట వారికి. అలాగే సకాలంలో పెళ్లి కావట్లేదని, ఒకవేళ అయినా కాని వారి మనసుకు నచ్చిన వారు దొరకలేక మానసిక క్షోభకి గురై చాలా మంది యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారట..ఇక జపాన్ లో రోజు రోజుకి యువతుల ఆత్మ హత్యలు ఎక్కువ అవుతున్న ఈ నేపథ్యంలో జపాన్ లో చాలా మంది యువతులకు సైకలాజికల్ ట్రీట్మెంట్ మెంట్స్ అందిస్తున్నారట...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....

మరింత సమాచారం తెలుసుకోండి: