జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీరియస్ గా ఉన్నారు. తిరుపతి ఎన్నికల విషయంలో ఆయన భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది.  బిజెపి నేతలు ప్రతి విషయంలో కూడా తనను ఇబ్బంది పెడుతున్నారు అనే ఆవేదన లో పవన్ కళ్యాణ్  ఎక్కువగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన సరే ఆయనకు బిజెపి పెద్దల నుంచి సహకారం రాలేదు. ఇక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కూడా ఆయన మాటకు విలువ లేకుండా పోతుంది.

దీనితో ఇప్పుడు జనసేన పార్టీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లడానికి పవన్  అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నా సరే ఆ పార్టీ నుంచి ఏమాత్రం సహకారం రావడం లేదు అనే ఆవేదన కొంతమంది నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు జనసేన పార్టీ అగ్రనేతలు కూడా బిజెపితో ఉండడం వల్ల ఉపయోగం లేదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు  బిజెపి తో తెగతెంపులు చేసుకోవడానికి పూర్తిగా సిద్ధమైనట్లు సమాచారం.

ఉగాది రోజున భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్టు గా ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించింది. దీనికి కాపు సామాజిక వర్గం బాగా సహకరించింది కూడా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనబడలేదు. ఇంకా కొన్ని స్థానాలను జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ కారణంగా కోల్పోయిన పరిస్థితి. అందుకే ఇప్పుడు ఆ పార్టీని పూర్తిగా పక్కన పెట్టడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని రాజకీయవర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: