తిరుపతి ఉప ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే చిరంజీవి ప్రచారం చేసే విషయానికి వస్తే కొన్ని కొన్ని అంశాల్లో జనసేన పార్టీ ఆయన మీద ఆధారపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కొంతమంది నేతలు ఆయనకు అండగా నిలిచారు. తిరుపతి ఉప ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేస్తే మాత్రం జనసేన పార్టీకి మంచి ఫలితం కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి చిరంజీవి దూరంగా ఉండే అవకాశాలున్నాయి.

తన సన్నిహిత నేతలతో ఆయన ఇప్పటికే ఇదే విషయాన్ని చెప్పారట. రాష్ట్రంలో సినీ పరిశ్రమ విషయంలో ముందడుగు వేయాలని అనుకుంటున్నాం అని ఇలాంటి తరుణంలో ఒక పార్టీకి మద్దతు ప్రకటిస్తూ వెళ్తే తనకు ఇబ్బందులు ఉంటాయని విశాఖలో ఒక స్టూడియో నిర్మాణం చేపట్టే ఆలోచనలో తాను ఉన్నానని కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ప్రచారం చేస్తే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని చిరంజీవి చెప్పారట. ఇక భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేను అనే అంశాన్ని చిరంజీవి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.

అయితే బీజేపీ అగ్రనేతలు కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశాలు లేవు. దాదాపు ఏపీలో బీజేపీ మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూడా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అందుకే జనసేన పార్టీ ఇప్పుడు బీజేపీ ని పక్కనపెట్టి ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: