రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది.ఈ మేరకు జిల్లాల్లో నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారం ముగిసిన కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ప్రచారంలో జరిగిన జోరు గతంలో ఎన్నడూ లేదనే చెప్పాలి. ప్రచారంలో చివరి రోజు కావడంతో బరిలో దిగిన అభ్యర్థులకు పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలుపుతూ హోరెత్తించారు.  ముఖ్యంగా టీడీపీ నేతలు అయితే అధినేత చంద్రబాబు బాబుతో సహా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ప్రచారం చేశారు.


ఈ మేరకు లోకేశ్ పర్యటన కాస్త వైసీపీ నేతలకు చిర్రెత్తించింది.. విషయానికొస్తే..మచిలీపట్నంలో తాపీ కత్తి పేర్ని నానిలు ఈ రెండేళ్ల కాలంలో కత్తి డ్రామాలు మినహా ప్రజలకు చేసింది ఏమిటో చెప్పాలంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రశ్నించారు. మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం సోమవారం రోడ్‌షోలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. రామానాయుడుపేట, పరాసుపేట, చిలకలపూడి, చింతచెట్టు సెంటరు, తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తూ అధికార పార్టీ అక్రమాలపై ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పేర్ని ఈ రెండేళ్ల పాటు ఇక్కడ ఏం చేశారో ప్రజలకు సమాధానం ఇవ్వాలని కోరారు.


వర్షంపడితే మునిగిపోయే బందరు బస్టాండుకూ ఏమీ చేయలేకపోయారన్నారు. తమ అభ్యర్థు.లను గెలిపిస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన కొట్టె జయలక్ష్మిని మేయర్‌గా చేస్తామని లోకేష్‌ ప్రకటించారు. అన్న క్యాంటీన్‌లను పునరుద్ధరిస్తామని, ఇంటిపన్ను బకాయిలు మాఫీ చేసి, ప్రస్తుతం పన్నును 50 శాతానికి తగ్గిస్తామన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ కుట్రలు పన్నుతున్నారు. డబ్బులు ఇచ్చి మభ్య పెట్టేందుకు చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు ఇచ్చే డబ్బులను తీసుకోండి.. కానీ టీడీపీ కి ఓటు వేయడం మర్చిపోకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన మాటలకు కొందరు నవ్వుకున్నారు. ఇలాంటి తెలివి ముందెన్నడూ చూడలేదని ఎద్దేవా చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: