తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి కూడా కష్టపడిన నేతలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది నేతలు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో ఉన్న కొంతమంది నేతలు పార్టీకోసం కష్ట పడటం మానేసి వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువగా కష్టపడుతున్నారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తున్న సమయంలో కూడా ఆయనకు ప్రోత్సాహం అందించే విషయంలో చాలా మంది నేతలు ముందుకు రావడం లేదు.

దీని కారణంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ఎక్కువగా నష్టపోతున్నది. అయితే ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొంతమంది నేతలు విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. తనకు సహకరించని సీనియర్ నేతలను తమ పార్టీ నుంచి పక్కకు తప్పించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో అగ్రనేతల హవా అనేది ఎక్కువగా ఉంది. దీని వలన సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.

చాలా వరకు జిల్లాలో అగ్ర నేతలు పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో చాలా మంది యువ నేతలు పార్టీకి దూరమవుతున్నారు. అందుకే ఇప్పుడు నారా లోకేష్ కొంతమందిని పక్కన పెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీలో ఉన్న సమస్యలను పట్టించుకునే విషయంలో ఇప్పటివరకు నారా లోకేష్ పెద్దగా దృష్టి సారించలేదు. కానీ ఇప్పుడు మాత్రం పార్టీలో సమస్యలు పరిష్కరించలేదు అంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో ఒక కమిటీని ఏర్పాటు చేసి పార్టీలో ఎంతవరకు నేతలు పని చేస్తున్నారు ఏంటనేది దానిపై ఆయన ఒక నివేదిక కూడా తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: