ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసే వాటిలో సినిమాలు ప్రథమ స్థానంలో ఉంటాయి. ముఖ్యంగా యువత సినిమాలలోని హీరోయిజనికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. తమ అభిమాన హీరో సిగరెట్ తాగితే..అది తప్పు అని తెలిసిన వాళ్ళు కూడా తాగడం, ఒక గ్యాంగ్ లను ఏర్పరచుకొని సినిమాలలో చూపిన విధంగా తమను తాము హీరోలుగా ఊహించుకోవడం వంటివి యువకులు చాలానే చేస్తూ ఉంటారు. ఇలా చెయ్యడానికి కారణం చూస్తే కేవలం సినిమాల ప్రభావమే అని స్పష్టంగా తెలుస్తుంది. అలా సినిమాల ప్రభావంతో ఎంతో మంది యువకులు తమ భవిష్యత్తు ను నాశనం చేసుకున్నా సందర్భాలు చాలానే ఉన్నాయి.

 ఇక ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ లో వస్తున్న రెండు సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దాదాపుగా తెలుగు సినిమాలలో కనుమరుగు అయిపోయిన నక్సల్స్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, దగ్గుబాటి రానా తమ సినిమాలను తెరకెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు నక్సల్ సినిమాలు టాలీవుడ్ లో చాలానే వచ్చాయి. దాసరి నారాయణ రావు, ఆర్ నారాయణ మూర్తి, వంటి దర్శకులు అన్నల కథాంశంతో సినిమాలు తీసి ఒక ట్రెండ్ సెట్ చేశారు. అయితే అప్పటి యువత కేవలం సినిమాల వల్లనే ప్రభావితం అయ్యి మావోలు గా మారిన సందర్భాలు ఉన్నాయి.

 దాంతో ఇన్నేళ్ల తరువాత మళ్ళీ తెలుగులో నక్సలిజాన్ని చూపించేందుకు సినిమాలు రెడీ అవుతుండడం, అందులోని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వంటి హీరోలు నక్సలైట్స్ గా నటిస్తుండడంతో యువత పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. యువతను పెడ దోవ పట్టించే ఇలాంటి సినిమాలను కట్టడి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలు గతంలో మాదిరి యువత పై నక్సల్స్ ప్రభావాన్ని ఏమేర చూపిస్తాయో చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: