పశ్చిమ బెంగాల్ ఎన్నికలే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత కీలకం అని చెప్పాలి. మరో వారం గడిస్తే ఫలితాలు కూడా వస్తాయి. బెంగాల్ లో చూస్తే కేవలం చివరి విడత పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది.

ఈ నేపధ్యంలో బెంగాల్ ఎవరి పరం అవుతుంది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గానూ కేవలం యాభై లోపు సీట్లు తప్ప అన్నింటా ఎన్నికలు జరిగిపోయాయి. ఒక విధంగా జనాభిప్రాయం ఈవీఎంలో జాగ్రత్తగా నిక్షిప్తం అయిపోయింది. బెంగాల్ లో ఎవరు విజేత అన్నదే ఇపుడు పెద్ద ఎత్తున సాగుతున్న చర్చ.

బెంగాల్ లో గత పదేళ్ళుగా అధికారంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఉంది. మరి యాంటీ ఇంకెబెన్సీ ఓటింగ్ అనేది కూడా పెద్ద ఎత్తున ఉంటుంది అన్నది అందరూ అంగీకరించే విషయం. ఇదిలా ఉంటే బెంగాల్ లో బీజేపీ పాగా వేయడానికి చూస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు కైవశం చేసుకోవ్డంతోనే బీజేపీకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.

దాంతో బీజేపీ మమతను అడుగడుగునా అడ్డుకుంటోంది. మరో వైపు చూస్తే మమత కూడా గట్టిగానే పోరాడుతోంది. కానీ మమతను దెబ్బ కొట్టాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ ఆమె క్యాడర్ ని లీడర్లను లాగేసింది. మరో వైపు చూసుకుంటే పదేళ్ళుగా అధికారానికి దూస్రం అయిన లెఫ్ట్ పార్టీలు ఈసారి తమ ప్రభావాన్ని గణనీయంగా చూపిస్తారు అంటున్నారు. బెంగాల్ లో 171 సీట్లలో వారు పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ 91 సీట్లఓ పొత్తు పెట్టుకుని కూటమి తరఫున పోటీలో ఉంది. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరిట మరో పార్టీ కూడా ఈ కూటమిలో చేరింది.

ఆ ఫ్రంట్ 26 సీట్లకు పోటీ చేస్తోంది. మొత్తానికి చూస్తే ఇపుడు బీజేపీ కానీ మమత కానీ పూర్తి మెజారిటీ అంటే 148 సీట్లను సాధించే సీన్ లేదని ఎన్నికల పండిట్స్ అంటున్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు గతం కంటే బాగా పుంజుకున్నారు అంటున్నారు. మొత్తానికి చూస్తే బెంగాల్ లో హంగ్ వస్తే లెఫ్ట్ పార్టీల హవా మళ్లీ మొదలైనట్లే అంటున్నరు. వారే అక్కడ కింగ్ మేకర్ పాత్రలోకి వస్తారని చక్రం తిప్పుతారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: