ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులలో కూడా ఆగ్రహం పెరిగిపోతుంది. కనీసం ఆయన మీడియా ముందుకు కూడా రాకపోవడంతో ప్రజలలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగాలను ప్రజలు చాలా ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు ఆయన కనీసం మీడియా ముందు కనపడకపోవడంతో ప్రధానమంత్రి మోడీ కి ఏమైంది అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అవసరమైన సందర్భంలో కూడా ఆయన బయటకు రాకపోవడం ప్రజలకు అండగా నిలబడలేకపోవడంతో ప్రజలలో ఇప్పుడు మోడీ పై అభిప్రాయాలు మారిపోతున్నాయి.

రాజకీయంగా ఉన్న కక్ష సాధింపులు తీర్చుకునే ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు ప్రజలకు అవసరమైన సందర్భంలో అండగా నిలబడే లేకపోవడం ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మోడీ విషయంలో చాలామందికి చాలా అభిప్రాయాలున్నాయి. 2014 ఎన్నికల తర్వాత ఆయనపై దేశంలో చాలా నమ్మకం ఉంది. కానీ మోడీ ఒక నమ్మకాన్ని కూడా నెరవేర్చలేక పోయారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కనీసం ఆయన బయటకు వచ్చి మాట్లాడ లేక పోవడంతో బీజేపీ కార్యకర్తలు కూడా ప్రజలకు ఏ సమాధానం ఇవ్వాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు.

సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు శవాలు గంగానదిలో కొట్టుకు వస్తున్నా మోడీ నుంచి స్పందన రావడం లేదు. ఇప్పుడు మోడీ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు మోడీ విషయంలో అసలు సినిమా అర్థం అయింది అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా మోడీ కేవలం లక్ష్యాలు మాత్రమే పెట్టుకొని ముందుకు వెళ్తారని కానీ ఆయనలో ఒక విషయం లేదు అంటూ ఎవరికి వారుగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా మోడీ రాజకీయ నాయకుడు మాత్రమే గాని పరిపాలనాదక్షుడు కాదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: