తమకు అనంతమైన పుణ్యఫలాలు దక్కాలని ప్రజలు అక్షయతృతీయ వ్రతం చేస్తుంటారు. ఈ రోజు దాన ధర్మాలు చేయడంతోపాటు పలు స్తోత్రాలను పారాయణం చేస్తే సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. అష్ట ఐశ్వర్యాలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మీ కటాక్షం కోసం అక్షయ తృతీయ నాడు పూజలు చేస్తుంటారు. ఐతే చాలా మంది ప్రజలు అక్షయ తృతీయ పుణ్యదినాన బంగారం విక్రయించడం, పిల్లలను స్కూల్ లో జాయిన్ చేయడం, ఇంటి నిర్మాణం ప్రారంభించడం, ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయడం వంటి శుభప్రదమైన కార్యాలను చేస్తుంటారు.

ముఖ్యంగా అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొంటుంటారు. సంపదకు చిహ్నం గా భావించే బంగారం అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేస్తే ఏడాది పొడుగునా ఇంట సంపద కొలువు తీరుతుందని ప్రజలు విశ్వసిస్తుంటారు. ఈ రోజున భగవంతుడికి ఏది సమర్పిస్తే అది రెండింతలు అవుతుందని భావిస్తారు. చాలా మంది భక్తులు బంగారం కొని దేవుడికి సమర్పించి తమ ఐశ్వర్యం రెట్టింపు కావాలని కోరుకుంటారు. ఈరోజున బంగారం కొంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. నిజానికి అక్షయ తృతీయ నాడు భక్తులు స్వయం పాకం, వస్త్రదానం, ఉదక దానం వంటివి ఎన్నో చేసే వారు కానీ కాలక్రమేణా ఆ ఆచారాలన్నీ కనుమరుగయ్యాయి. ప్రస్తుతం అక్షయ తృతీయ నాడు కేవలం బంగారం కొనుగోలు చేయడమే ముఖ్య ఆచారం అయ్యింది.

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుండగా.. ఈ ఏడాది అక్షయతృతీయ రోజు బంగారం విక్రయాలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. లాక్డౌన్‌, కర్ఫ్యూలు వంటి కఠిన నిబంధనలు అమలు చూస్తున్న నేపథ్యంలో బంగారం సేల్స్ పడిపోయే అవకాశం ఉంది. మళ్లీ వచ్చే అక్షయ తృతీయ పర్వదినం నాటికి భారత దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిద్దాం. ఇకపోతే ఈ రోజున మద్యం తాగకూడదని పండితులు చెబుతుంటారు. అలాగే మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదని ఇవి అనారోగ్యానికి కారణం అవుతాయని పండితులు చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: