ఏపీలో స్ట్రాంగ్‌గా ఉన్న మంత్రుల్లో పేర్ని నాని ఒకరు. మచిలీపట్నం(బందరు) నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాని మంత్రిగా, జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు తన శాఖపై పట్టు తెచ్చుకుని మంత్రిగా దూసుకెళుతూనే, మరో వైపు అధికార పార్టీ నేతగా ప్రతిపక్షాలకు చెక్ పెడుతున్నారు. అలాగే ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పటిస్తున్నారు. ఓ వైపు బందరు పోర్ట్ పనులు వేగవంతం చేశారు.  మరోవైపు బందరు పట్టణంలో కొత్తగా మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.


అటు ప్రజలకు ఎలాంటిలోటు లేకుండా పథకాలు అందిస్తున్నారు. ఈ విధంగా పనిచేస్తూ మంత్రి నాని బందరు నియోజకవర్గంలో స్ట్రాంగ్ అయిపోయారు. ఇలా స్ట్రాంగ్‌గా ఉన్న నానికి చెక్ పెట్టడానికి టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మిగతా టీడీపీ నాయకులు యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా రవీంద్ర మాత్రం, బందరు నియోజకవర్గంలో స్ట్రాంగ్ అవ్వడానికి చూస్తున్నారు.


గత రెండేళ్లుగా పార్టీ కేడర్‌కు సపోర్ట్‌గా ఉంటూ, వైసీపీపై ఫైట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో నానికి కొల్లు చెక్ పెట్టడం అంత సులువు కాదు. నెక్స్ట్ ఎన్నికలో పేర్ని బలం ముందు కొల్లు తేలిపోయే ఛాన్స్ ఉంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీకి సపోర్ట్ ఇస్తే ఫలితం మారే ఛాన్స్ ఉంది.


2014లో పవన్ సపోర్ట్ ఇవ్వడం వల్లే బందరులో పేర్నిపై కొల్లు మంచి మెజారిటీతో గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి పేర్నికి ప్లస్ అయింది. కొల్లుపై ఐదు వేల ఓట్ల తేడాతో గెలిచారు. అదే జనసేన సపోర్ట్ ఉంటే కొల్లుకే విజయం దక్కేది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో కొల్లు గెలవడానికి పవన్ హెల్ప్ కావాల్సిందే అని చెప్పొచ్చు. లేదంటే నానికి చెక్ పెట్టడానికి కొల్లు గట్టిగా కష్టపడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: