మ‌నుషులంతా స‌మ‌స్య‌ల‌కు జీవితాల‌ను అంకితం చేస్తున్నారనుకోవాలి. వ‌రంగ‌ల్ ప‌ట్టాలు..ఘ‌ట్ కేస‌ర్ ప‌ట్టాలు..శ‌వాల‌ను మో స్తున్నాయి. మోయ‌డానికి స‌రిప‌డినంత శ‌క్తి వాటికి ఉన్నాయి. ప‌ట్టాల‌పై తేలిన శ‌వాల‌న్నీ రేప‌టి స‌మాజంపై స‌వాళ్లు విసురు తు న్నాయి. రాళ్ల‌ను విసిరి చంపండి నిందితులు ఎవ్వ‌ర‌యినా స‌రే అని చెప్ప‌డం సులువు. కానీ ఇది అంతిమ నిర్ణ‌యం కాదు కదా! అంతిమ తీర్పు ప్ర‌జ‌లు ఎంత కాలం ఇవ్వ‌గ‌ల‌రు? అంతూపొంతూలేని ద‌రిద్రాల‌కు ఈ స‌మాజం ఎందుకు బాధ్య‌త వ‌హించ‌డం లే దు. మ‌నం మ‌నుషులం కాదు స‌ర్ మృగాలం అని ఎందుకు  నిరూపించుకుంటున్నాం. వాటితో పోటీ ఎందుకు? ద‌రిద్ర‌గొట్టు జీవితా ల్లో ఇంత‌టి నిరాశ ఎందుకు. ఘ‌ట‌న‌కు ఆ ఒక్క‌డే కాదు ఈ స‌మాజానిదే బాధ్య‌త. తాగి తూలే వ్య‌క్తుల‌ను త‌న్ని అవ‌తలికి విసిరే య‌ని మ‌నుషుల‌దే ఈ బాధ్య‌త. బాధ్య‌త లేని స‌మాజంలో బాధ్య‌త లేని మ‌నుషులే ఉంటారు. చావు, పుట్టుక‌ల కోలాహ‌లంలో ఇలాంటివి ఇక‌పై జ‌ర‌గ‌కూడ‌దు అని కోరుకోవడం అత్యాశ‌. ఎవ్వ‌రూ ఎవ్వ‌రినీ నియంత్రించ‌లేని స‌మాజంలో ఉన్న‌ప్పుడు దేనిని మ‌నం ఆప‌గ‌లం. మృత్యు ప‌ల‌క‌రింపుల‌ను ఆహ్వానించ‌డం మ‌న వంతు మ‌న బాధ్య‌త అదొక్క‌టే చేయాలి  చేస్తున్నాం కూడా!


 
క‌థ ముగిసింది అని సంతోషించే స‌మ‌యం కాదిది. బాధ‌కు అర్థం వెతికి స‌మాజాన్ని త‌ట్టిలేపే సంద‌ర్భం ఇది. కానీ మ‌నం ఆ ప‌ని చేయ‌గ‌ల‌మా? చిన్నారి చైత్ర కు నివాళి అని రాసి మ‌నం సాధించేది ఏమీ ఉండ‌దు. కొన్ని కొవ్వొత్తుల వెలుగులు క‌రిగిపోతాయి. కొన్ని రోజుల తరువాత మ‌రో రాజు గాడు రాడ‌ని ఏంటి గ్యారంటీ? మ‌న చుట్టూ ఉన్న వారిని మ‌నం ప‌రిశీలించి ఓ సారి అయినా వారి మంచిని చెడునీ అంచ‌నా వేయ‌గ‌ల‌గాలి. అనుమానం ఉంటే పోలీసుల‌కు చెప్పండి.



ఈ ఒక్క ప‌ని చేయ‌గ‌లుగుతున్నామా మ‌నం.రాజ‌కీయ పార్టీల‌కు రాజ‌కీయం చేత‌నౌతుంది. దానిని మ‌నం న‌మ్మ‌కూడ‌దు. మ‌నుషుల జీవితాలు ఇలా అర్ధంత‌రంగా ఆగిపోవడంలోనే అర్థం లేదు. చిన్నారి చైత్ర జీవితాన్ని నాశ‌నం చేసిన వాడి జీవితం ఏమ‌యింది. ఇదొక్క‌టే ఈ క‌థ‌కు ముగింపు అనుకోవ‌డంలో అర్థం లేదు. ఇంకా కొన్ని క‌థ‌లు మ‌న చుట్టూనే వికృతంగా తిరుగుతున్నాయి. ఆపాల్సిన బాధ్య‌త మ‌న‌ది. చేయ‌గ‌ల‌మా?



నిన్న‌టి వేళ నిందితుడు రాజు (చిన్నారి చైత్ర‌ను పాశ‌వికంగా చంపిన నిందితుడు) అంత్య‌క్రియ‌లు వరంగ‌ల్ పోత‌న న‌గ‌ర్ స్మ‌శాన వాటిక‌లో ముగిశాయి. రాజు త‌ల్లి ఈ అంత్య‌క్రియ‌లు చేప‌ట్టారు. కేవ‌లం ముగ్గురిని మాత్ర‌మే అనుమ‌తించారు. ఓ విధంగా అత్యంత గోప్యంగానే ఈ ప‌ని కానిచ్చేశారు. ఇంత‌కూ ఈ క‌థ చెప్పిందేంటి? మ‌ద్యం మ‌త్తుకు బానిస అవుతున్న యువ‌త‌ను గాడిలో పెట్ట‌డం ఎలా?

మరింత సమాచారం తెలుసుకోండి:

tg