ప్లాంట్లు అమ్మ‌కంతో డ‌బ్బులు వ‌స్తాయి
ప్రయివేటు ప‌ద్ధ‌తిలో డ‌బ్బులు వ‌స్తాయి

ఉద్యోగాలు పోతాయి అన్న సోయి లేదు మాకు
అందుకే మోడీ  ఎప్పుడు వ‌చ్చినా లేదా మోడీ ద‌గ్గ‌ర‌కు

ఎప్పుడు మేం వెళ్లినా స‌న్మానాలు మాత్రం చేసే వ‌స్తాం
అది మా నినాదం అదే మా ప‌ద్ధ‌తి అధికారం మా నినాదం

అధికారం నిలుపుకోవ‌డం మా ప‌ద్ధ‌తి లేదా నైజం


మోడీ ప్ర‌ధాని అయ్యాక తెలుగు రాష్ట్రాల‌కు చేసిందేం లేదు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల‌కూ జాతీయ ప్రాజెక్టులు ఎనౌన్స్ చేయాలి. పోల‌వ‌రం ఎప్పుడో గుర్తింపులో ప్రాజెక్ట్. కానీ నిధులు లేవు. ప‌క్క‌నే ఉన్న తెలంగాణ‌లో కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు మాత్రం నిధులు ఇవ్వ‌దు. జాతీయ ప్రాజెక్టు అని చెప్ప‌దు. రెండు ప్రాంతాల‌కూ చెందిన వెనుక‌బ‌డిన జిల్లాల‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త ఉంది. అవేవీ చేయ‌దు కేంద్రం. ఆంధ్రాకు ప్ర‌త్యేక హోదా అడ‌గ‌కండి ఇక అని చాలా మంది పెద‌వి విరుస్తున్నారు. ఇది కూడా మోడీ కంటికి చిక్క‌దు. ప్ర‌భుత్వానికి చెందిన ప్లాంట్లు అమ్మి డ‌బ్బులు గుంజుకోవ‌డం మిన‌హా మోడీ చేసిందేం లేదు అన్న‌ది ప్ర‌ధాన విమ‌ర్శ.


 
రెండు తెలుగు రాష్ట్రాల‌కూ విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు చేయాల‌న్న రూల్ ఉంది. నియ‌మం అయితే ఉంది కానీ ఆయ‌న పాటిస్తారా పాటించ‌రు క‌దా! రెండు తెలుగు రాష్ట్రాల‌కూ ఆస్తులున్నాయి. అవి ఉమ్మ‌డివి. వీటి పంప‌కంపై కేంద్రం పెద్ద‌న్న పాత్ర‌లో జీవించాలి. కానీ న‌టిస్తోంది. కొన్ని సార్లు చూసీ చూడ‌ని విధంగా పోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల‌కూ జ‌ల వివాదాలు ఉన్నాయి. కేవ‌లం బోర్డుల ప‌రిధిని నిర్ణ‌యించి చేతులు దులుపుకుంటోంది త‌ప్ప బోర్డుల నిర్వ‌హ‌ణ‌కు సాయం చేయ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో కృష్ణా బోర్డు కానీ గోదావ‌రి బోర్డు కానీ నిర్వ‌హించాలంటే ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిధులు జ‌మ చేయాలి. ఆ ప‌ని వీరు చేయ‌డం లేదు. చేయ‌న‌ప్పుడు ఎందుకు చేయ‌డం లేదు అని ప్ర‌శ్నించ‌డం లేదు. కేవ‌లం వివాదాలు వ‌స్తే చూసి, విని మీ గొడ‌వ మీరు ప‌డండి అని పోతోంది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి:

pm