ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి మరోసారి. ఢిల్లీ పర్యటనకు వెళ్లే పలు కీలక అంశాల గురించి ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారీగా వరదలు రావడం ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో భారీ వరదలతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ లకు ఆయన వేర్వేరుగా లేఖలు కూడా రాశారు.

కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం  ప్రధానంగా విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందించలేదని అంశాన్ని ఆయన తెలియజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలో మరోసారి భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే ఆర్మీ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని జగన్ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే నాలుగైదు రోజుల్లో భారీగా చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.వరదల కారణంగాా జరిగిన నష్టాన్నీ అదుకోవాలని  సియం ప్రధానమంత్రిని కోరె అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరడానికి జగన్ వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించి రాజకీయ పరమైన అంశాలను కూడా చర్చించే అవకాశం ఉందని మూడు రాజధానులు బిల్లు కు సంబంధించి జగన్ కేంద్రంతో చర్చించే అవకాశం ఉందని అని అంటున్నారు. మరి జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్తారు ఏంటనేది లేకపోయినా జగన్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: