శృంగవరపుకోట..ఈ నియోజకవర్గం పేరు చెబితే ఠక్కున టీడీపీకి కంచుకోట అని గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ మొదట నుంచి టీడీపీ హవా కొనసాగుతూనే వస్తుంది. 1983 నుంచి చూసుకుంటే 1999 వరకు ఇక్కడ టీడీపీ గెలుపుకు బ్రేకులు పడలేదు. వరుసగా అయిదుసార్లు టీడీపీ గెలిచేసింది. 2004లోనే ఇక్కడ టీడీపీ ఓడిపోగా, మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచేసింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. వైసీపీ తరుపున కడుబండి శ్రీనివాసరావు గెలిచిన విషయం తెలిసిందే.

అయితే ఈ రెండున్నర ఏళ్లలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు పరంగా చూసుకుంటే...కడుబండి బాగా వెనుకబడిన ఎమ్మెల్యేల లిస్ట్‌లో ఉన్నారని చెప్పొచ్చు. ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల లిస్ట్‌లో కడుబండి ఉన్నారని పలు సర్వేలు వచ్చాయి. అంటే కడుబండి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత రావడం టీడీపీకి బాగా కలిసొచ్చింది. మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి కాస్త యాక్టివ్‌గా పనిచేయడం కూడా టీడీపీకి బాగా కలిసొచ్చింది.

కాకపోతే ఇక్కడ టీడీపీలో కీలకం పనిచేస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి...వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఈమె 1999లో ఎస్ కోట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమెకు సీటు దక్కలేదు. 2009, 2014 ఎన్నికల్లో కోళ్ళ లలిత కుమారి టీడీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో సీటు కోసం శోభా కూడా గట్టిగానే ట్రై చేశారు. కానీ చంద్రబాబు లలితకుమారికే సీటు ఇచ్చారు. ఇక టీడీపీ ఓటమి పాలవ్వడం, అటు తన కుమార్తె స్వాతిరాణి  వైసీపీలో ఉండటంతో హైమావతి కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు.

అయితే నెక్స్ట్ తన కుమార్తెకు సీటు దక్కించుకోవాలని హైమావతి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో కడుబండిపై వ్యతిరేకత ఉంది కాబట్టి...ఆయనని సైడ్ చేసి శోభా ఫ్యామిలీకి సీటు ఫిక్స్ చేయొచ్చు. చూడాలి మరి శృంగవరపుకోట సీటు ఎవరికి దక్కుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: