కరొనా మహమ్మరి విజ్రుంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకవైపు కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్ ప్రక్రియను కూడా అధికారులు వేగవంతం చేశారు. అయిన పరీక్షలను వైద్యులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పాజిటివ్ కేసులు మరింత పెరుగుతున్నాయని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలొ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతూన్నాయని అధికారులు చెబుథున్నారు... ఇరు రాష్ట్రాల లో కేసులు రోజుకు మూడు వేలకు పైగా నమోదు అవుతున్నాయి.


ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలను వైద్యులు నిర్వహిస్తున్నారు.. ముఖ్యంగా గర్భిణీలకు ఇటువంటి పరీక్షలను నిర్వహిస్తున్నారు. తల్లికి పుట్టబొయె బిడ్డను కరోనా నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ వైద్యులు మరో ఘనతను సాదించారు. నిండు గర్భంతో వున్న మహిళలకు వైద్యులు పునర్జన్మ ను ఇచ్చారు. ఆమెకు డెలివరీ ముందు కరొన ఉందని నిర్దారన అయ్యింది. దాంతో వైద్యులు ఆమెను ఆమె బిడ్డను కాపాడే ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అవ్వడం తో అందరి మన్ననలను వైద్యులు అందుకున్నారు.


వివరాల్లోకి వెళితే. ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం అత్యవసర పరిస్థితుల్లో ఓ గర్భిణీ వచ్చింది. అయితే కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు అప్పటికే కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో అన్ని రకాల జాగ్రత్తలు పాటించి డెలివరీ చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా వైద్యులు అన్నీ రకాల చర్యలను తీసుకున్నారు. ఎల్లారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యులు ఈ విజయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజెసారు. ఈ విషయం పై తెలుగు రాష్ట్రాల మంత్రులు స్పందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారు నిజంగానే డేర్ చేసారని ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇది నిజంగానే అరుదైనది.. మరో వైపు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతూన్నాయి.. దీంతొ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖా అధికారులు సూచిస్తున్నారు

 

మరింత సమాచారం తెలుసుకోండి: