ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా దూకుడు ప్రదర్శిస్తోంది. చివరకు అణు విద్యుత్ కర్మాగారాలపై సైతం దాడులు చేస్తోంది. ఇది ప్రపంచ దేశాలకు కోపం తెప్పిస్తోంది. రష్యా,ఉక్రెయిన్ కొట్టుకుంటే.. ఓకే.. కానీ.. దాని ప్రభావం మొత్తం యూరప్‌పై మరీ చెప్పాలంటే ప్రపంచంపై పడితే మాత్రం మిగిలిన దేశాలు చూస్తూ ఉరుకునే పరిస్థితి ఉండదు. అలాంటప్పడు.. అనివార్యంగా మిగిలిన దేశాలు కూడా ఈ యుద్ధంలో వేలు పెట్టే ప్రమాదం ఉంటుంది. అప్పుడు క్రమంగా ఇది ప్రపంచ యుద్ధం కూడా కావొచ్చు.


అయితే.. మిగిలిన దేశాలు రష్యాపై దాడికి దిగితే.. రష్యాను నామరూపాలు లేకుండా చేస్తే ఏమవుతుంది.. అప్పుడు మిగిలిన ప్రపంచం కూడా సర్వనాశనం అవుతుందంటున్నారు కొందరు నిపుణులు.. ఎందుకంటే.. తాను ఎప్పుడైనా యుద్ధంలో ఓడిపోతే.. తనను ఎవరైనా సర్వనాశనం చేస్తే.. ఆ తర్వాత ఆటోమేటిగ్గా ప్రపంచం నాశనమయ్యేలా రష్యా ఓ ఆయుధ వ్యవస్థను రూపొందించుకుంది. దీన్ని బట్టి చూస్తే.. ఎప్పుడైతే రష్యా ఉండదో.. ఇక అప్పుడు ప్రపంచమూ ఉండదని నిపుణులు చెబుతున్నారు.


ఈ విషయాన్ని గతంలో ఓసారి పుతిన్ కూడా చెప్పేసాడు. ఈ వ్యవస్థ పేరే డెడ్‌ హ్యాండ్  వ్యవస్థ. గతంలో అమెరికా, రష్యా మధ్య తీవ్రస్థాయిలో ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన సమయలోనే దీన్ని రూపొందించారట. ఆ సమయంలో అమెరికా నుంచి కాపాడుకొనేందుకు రష్యా తయారు చేసుకున్న ఆయుధ వ్యవస్థ ఈ డెడ్‌ హ్యాండ్‌ అన్నమాట. ఇప్పుడు రష్యా, అమెరికా వద్ధ ఉన్న అణ్వాయుధాల శక్తి అంతా ఇంతా కాదు.. ఒక్క మీట నొక్కితే.. ఏకంగా దేశానికి దేశమే భస్మీపటలం అయ్యేంత శక్తివంతమైనవి..


అలాంటి దాడి ఓ దేశంపై జరిగితే.. తిరిగి స్పందించడానికి ఆ దేశానికి అవకాశం ఉండదు. కానీ.. రష్యా పై దాడి చేస్తే మాత్రం అదే సమయంలో ప్రపంచం కూడా నాశనం అవుతుంది. ఎందుకంటే.. రష్యాపై దాడి చేసిన నాశనం చేస్తే.. ఆ విషయాన్ని గమనించి ప్రతిదాడి చేసేలా సెన్సర్లతో ఈ డెడ్‌ హ్యాండ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తమ దేశంపై అణు దాడి జరిగితే.. దేశంలో వివిధ భాగాల్లో అమర్చిన సెన్సర్లు దాన్ని గుర్తించి కేంద్ర సైనిక కమాండ్‌కు సిగ్నల్స్ పంపుతుంది. అక్కడి నుంచి స్పందన లేకపోతే.. తర్వాత ఈ డెడ్‌ హ్యాండ్ వ్యవస్త తనంతట తానే అణు దాడి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: