భారత్ - పాకిస్తాన్ మధ్య దాడులు ప్రతిదాడులతో రెండు దేశాల మధ్య ఉద్ధృక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆపరేషన్ సింధూర్‌ తర్వాత పాకిస్తాన్ ఎటాక్ ల‌ను భారత్ ఆర్మీ చాలా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. గత రాత్రి నుంచి చూసుకుంటే జమ్మూ నుంచి గుజరాత్ వరకు పలుచోట్ల పాకిస్తాన్ దాడులు చేసింది. పఠాన్ కోట్లో శబ్దాలలో కూడిన భారీ పెళ్లిళ్లు జరిగాయి. అలాగే చండీగఢ్లోను తెల్లవారు జామున దాడులు జరిగినట్టు తెలుస్తోంది. శ్రీనగర్లోని పలు ప్రాంతాలలో పాకిస్తాన్ దాడులు చేయడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇది తమకు తీవ్ర నష్టం అని కూడా వ్యాఖ్యానించారు. ఇక పౌర విమానాలే రక్షణ కవచంగా పాకిస్తాన్ చర్యలకు పాల్పడుతుందని భారత్ పేర్కొనడంతో పాకిస్తాన్ గగనతలం మూసివేయలని నిర్ణయం తీసుకున్నారు.


ఇక భారత దాడులకు తట్టుకోలేని పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నియంత్రణ రేఖకు అవతల వైపు పాకిస్తాన్ శత్రు సైన్యం డ్రోన్ లు ప్రయోగిస్తోంది. ఆ పోస్టులను భారత్ ఆర్మి ధ్వంసం చేస్తుంది. ఇదిలా ఉంటే సైబర్ దాడి కారణంగా భారతరత్ 70% ఎలక్ట్రిక్ గ్రిడ్ పనిచేయటం లేదంటూ సోషల్ మీడియాలో పాకిస్తాన్ నకిలీ ప్రచారం ప్రారంభించింది. భారత సైబ‌ర్ గ్రిడ్ పై సైబర్ దాడి అంటూ ఫేక్ పోస్ట్ పెడుతుంది. దీన్ని ఫ్యాక్ట్‌ చెక్ చేసి నకిలీ ప్రచారం అని పి ఐ బి తేల్చేసింది. అసత్య ప్రచారాలు నమ్మొద్దు అంటే కూడా ప్రజలకు సూచనలు చేసింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: