
అయితే తాజాగా ఈ కేసు విచారణ సరికొత్త మరొక తీసుకున్నట్లుగా కనిపిస్తోందట.. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ జరిగినట్లుగా కథలుగా వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ముప్పవరపు వీరయ్య చౌదరి మర్డర్ కేసులో విచారణకు పూనుకున్న పోలీసులు సైతం విచారణలో భాగంగా కొందరి మీద లాఠీలకు పని చెప్పడంతో తీవ్ర అస్వస్థకు గురై ప్రాణాలు కూడా కోల్పోయారు అనేటువంటి రీతిలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఏపీ అంతట ఇప్పుడు మరొకసారి సంచలనంగా మారుతున్నాయి.
ఒంగోలులోని పద్మ టవర్స్లో తన ఆఫీసులో ఉండగా కొంతమంది దుండగులు ముసుగులు వేసుకొని వచ్చి మరి కత్తిపోట్లతో వీరయ్య చౌదరిని దారుణంగా చంపారు. అయితే ఇప్పుడు ఈ ఉదాంతం లాకప్ డెత్ వ్యవహారం మరొక రకంగా కలకలాన్ని రేపుతోంది.. ఈ టిడిపి నేత మర్డర్ కేసులో అదే గ్రామానికి చెందిన మరొక టిడిపి నేత వీర గంధం దేవేంద్రనాథ్ చౌదర్ నిందితుడు అంటు కథలు కూడా వినిపించాయి. అయితే ఈ ఇద్దరి టిడిపి నేతల మధ్య వ్యాపార తగాదాలు విభేదాల వల్లే గతంలో ఎన్నికలలో జరిగే సమయంలో వీరిద్దరి మధ్య వచ్చిన గొడవలన్నీ కలిసి మర్డర్ కు దారితీసాయి అంటూ చాలామంది భావించారు.
ఈ విషయం మీద పోలీసులు కూడా మరో కొద్ది రోజులలో అన్ని విషయాలు మీడియా ముందు బయట పెట్టబోతున్నారని అనుకున్నారు. దేవేంద్రనాథ్ చౌదరి తో పాటుగా అతనికి సహరించినటువంటి మరి కొంతమందిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు కూడా తమ పద్ధతిలో పని చెప్పినా కూడా అసలు నిజం బయటికి రాలేదట. లాకప్ డెత్ కేసులో మరణించిన బాధితులు కుటుంబాన్ని కూడా పోలీసులు బెదిరించారు అంటూ కూడా కథనాలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ సీఎం చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా ..మూడు వారాలు పైగా కావస్తువున్న నిజం బయటికి రాకపోవడంతో అసలు దోషుల్ని తప్పించే ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతోందనే విధంగా అక్కడ టిడిపి నేతలకు ప్రశ్నలు గా మిగులుతున్నాయి.