
తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తోందని ప్రతిపక్ష నేతలు తెలుపుతున్నారు. కేవలం వారికి జూబ్లీహిల్స్ నియోజకవర్గమే టార్గెట్ గా చేసుకున్నారు. అక్కడ యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు కాబట్టి అటు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టారు. అలాగే ముస్లిమ్స్ జనాభా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముస్లింలకు సంబంధించి ఓవైసీ నుంచి మద్దతు లభించేలా చేసి వారిని పోటీ చేయకుండా చేస్తున్నారు. ఈ రెండిటి ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలవాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.
అందుకోసమే ఇప్పుడు ఈ 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని తెర మీదకి తీసుకోవచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వారి ఓట్ల కోసమే రేవంత్ సర్కార్ ఇలా చేస్తున్నట్లు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తున్నాయి. 50% రిజర్వేషన్ దాటడానికి వీలు లేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనమే తేల్చి చెప్పేసింది.. ఈ విషయం అటు అధికార పార్టీ ప్రతిపక్షాలకు కూడా తెలుసు. ఒకవేళ ప్రతిపక్షమే కాదు ఎవరు వ్యతిరేకిస్తే .. అదిగో వారు వ్యతిరేకిస్తున్నారంటూ చెబుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఓట్లు రాబట్టేలా చూస్తున్నారు. అయితే తాము వ్యతిరేకం కాదంటూ ఈటెల రాజేంద్రప్రసాద్, బిజెపి పార్టీ కూడా తెలియజేసింది. రేవంత్ సర్కార్ కి దమ్ముంటే చేసి చూపించాలంటూ చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఆరువారాలపాటు స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కేవలం మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.