టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ హీరో అంటే తెలియని వారు ఉండరు.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. కానీ గత రెండు సంవత్సరాల నుంచి విజయాల బాట పట్టి కెరియర్ ని గాడిలో పడేసుకున్నారు. అలాంటి కిరణ్ అబ్బవరం త్వరలోనే కె ర్యాంప్ అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. అలాంటి ఈ సమయంలో కె ర్యాంప్ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను మరియు తన లైఫ్ లోని కొన్ని లవ్ స్టోరీలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మరి కిరణ్ అబ్బవరం చెప్పిన విషయాలేంటి ఆ వివరాలు చూద్దాం.. కిరణ్ అబ్బవరం మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న తరుణంలోనే తన మొదటి మూవీ హీరోయిన్ రహస్య గోరఖ్ అనే హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గానే వీరికి ఒక బాబు కూడా జన్మించారు. 

అలాంటి కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ కంటే ముందే మరో ఇద్దరు అమ్మాయిలతో లవ్ లో పడ్డారట. అలాగే ఒక అమ్మాయితో ప్రైవేట్ గా కూడా కలిసి కిస్ కూడా ఇచ్చారట.. మరి ఆయన ఎవరితో లవ్ లో పడ్డారు అనే విషయంలోకి వెళ్తే.. కిరణ్ అబ్బవరం ఇంటర్మీడియట్ వరకు ఆయన బాయ్స్ హాస్టల్ లోనే చదువుతూ వచ్చారట. ఇప్పటివరకు అమ్మాయిలతో పెద్దగ టచ్ లేదని తెలియజేశారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత బీటెక్లో జాయిన్ అవ్వగానే ఆయనకు అమ్మాయిలు చాలా కొత్తగా కనిపించారట. ఫస్ట్ ఇయర్ లోనే వాళ్ళ క్లాసులోని ఒక అమ్మాయికి కాలేజ్ కి వెళ్లిన మొదటి రోజే ప్రపోజ్ చేసారట.  కానీ ఆమె రిజెక్ట్ చేసిందట.

 రెండు సంవత్సరాలపాటు గట్టిగా ట్రై చేసిన ఆమె పడకపోవడంతో చివరికి ఆమెను వదిలేసి సైలెంట్ అయిపోయారట. ఎప్పుడైతే కిరణ్ అబ్బవరం ఆమె వెంట తిరగడం మానేసారో అప్పటినుంచి ఆమె కిరణ్ పై ఇష్టాన్ని పెంచుకుందట. ఆ తర్వాత తానే వచ్చి ప్రపోజ్ చేసినా నో చెప్పారట. ఆ తర్వాత బీటెక్ థర్డ్ ఇయర్ లో వేరే అమ్మాయితో పరిచయం పెంచుకొని ఆమెకి ప్రైవేట్ గా మొదటిసారి కిస్ కూడా ఇచ్చారట.  ఇక కాలేజ్ అయిపోయిన తర్వాత ఎలాంటి లవ్ స్టోరీలు లేవు. అలా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత రహస్య గోరఖ్ తో లవ్లో పడి చివరికి ఆవిడనే పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవిస్తున్నారు కిరణ్ అబ్బవరం.  అయితే కే ర్యాంప్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని ఆయన బయటపెట్టడంతో  సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: