ఈ మధ్య సైబర్ నేరగాళ్ల బారిన  పడే సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ సైబర్ నేరగాళ్ల వలన చాలామంది సామాన్యులే కాకుండా సెలబ్రిటీలను , రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా టిడిపి ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లుగా తెలుస్తోంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఏకంగా రూ. 1.07 కోట్ల రూపాయలను కాజేసినట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.


అసలు విషయంలోకి వెళ్తే కడప జిల్లా మైదుకూరు టిడిపి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు ఉగ్రవాదుల బ్యాంకు లావాదేవీలతో ప్రమేయం ఉందని మనీలాండరింగ్ పేరు చెప్పి మరి ఈ ఎమ్మెల్యేను సైబర్ నేరగాళ్ల భయపెట్టి, నకిలీ పత్రాలు చూపిస్తూ ఏ క్షణంలోనైనా సరే తనని అరెస్టు చేస్తామని బెదిరించారు. రూ. 1.07 కోట్ల రూపాయలు కాచేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ రావు హైదరాబాదులో నివాసముంటున్నారు ఈనెల 10వ తేదీన ఉదయం 7:30 నిమిషాల సమయంలో ఈ నంబర్ నుంచి 9220373818 ఫోన్ వచ్చిందని ఫోన్ చేసిన వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారని తెలిపారు.


 మనీలాండరింగ్ కేసు అధికారులమని దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదుల ఖాతా నుంచి మీ ఖాతాకు డబ్బు బదిలీ అయిందని చెప్పి అందుకు సంబంధించి నోటీసులు సిబిఐ అరెస్టు వారెంట్ అంటూ కొన్ని పత్రాలను చూపించారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే 7842581950 నెంబర్ నుంచి వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు, మీ ఖాతాకు ఉగ్రవాదుల నుంచి రూ .3కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని ఈ కేసులో విచారణలో భాగంగా సైబర్ క్రైమ్ కార్యాలయానికి రావాలని చెప్పారట. దీంతో దర్యాప్తుకు సహకరించకపోతే ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామంటూ బెదిరించారు. అయితే బ్యాంకు ఖాతాను పరిశీలించగా రూ. 1.07 కోట్ల రూపాయలు బదిలీ చేసుకున్నారని మరో రూ.60 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: